నందమూరి నటసింహం బాలకృష్ణకు ప్రస్తుతం వరుస సూపర్ హిట్లు అందుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే.. ఆయన కెరీర్లో ఎన్ని సెన్సేషనల్ బ్లాక్ బస్టర్లు ఉన్నా.. అత్యంత స్పెషల్ మూవీ అంటే మాత్రం అఖండ పేరే వినిపిస్తుంది. ఆయనకు ఈ సినిమాతోనే పూర్వ వైభవం వచ్చింది. వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న బాలయ్య.. ఇక షెడ్‌కు వెళ్ళిపోయాడని.. ఆయన మార్కెట్ పూర్తిగా తగ్గిపోయింది.. సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడమే దిక్కు అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్న టైంలో అఖండ వచ్చింది. కరోనా లాంటి లాక్ డౌన్ లోను.. టికెట్ రేట్స్ చాలా తక్కువగా ఉన్నా.. థియేటర్లలో ఈ సినిమా చూసేందుకు జనం ఎగబడ్డారు. ఫలితంగా సినిమాకు అప్పట్లోనే రూ.70 కోట్లకు పైగా షేర్ వసూళ్లు దక్కాయి. 2021 డిసెంబర్ 5న రిలీజ్ అయిన ఈ సినిమా.. సంక్రాంతి వరకు థియేటర్లలో సందడి చేసింది.
అలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సీక్వెల్ అఖండ 2 అంటే ఏ రేంజ్లో హైప్ ఉండాలి.. కానీ ఈ సినిమాకు మాత్రం ఆడియన్స్ లో అంత బస్ క్రియేట్ కావడం లేదు. సినిమా ఫ్రీ థియేట్రికల్ బిజినెస్‌కు ట్రేడ్ నుంచి మంచి ఆఫర్లు వచ్చినా.. సినిమా చూసేందుకు అడ్వాన్స్ బుకింగ్ విషయంలో మాత్రం ఆడియన్స్ ఆ రేంజ్లో ఇంట్రెస్ట్ చూపించడం లేదు. నార్త్ అమెరికాలో ఇప్పటికే సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యి పది రోజులు అవుతున్నా.. సినిమా రిలీజ్‌కు ఈరోజు నుంచి 19 రోజులు మాత్రమే టైం ఉన్నా.. ఇప్పటివరకు కేవలం ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ లో 50 వేల డాలర్లు మాత్రమే రావడం.. అఖండ 2కు బిగ్ షాక్ అని చెప్పాలి. ఓ సీక్వెల్ కి ఉండాల్సిన బుకింగ్స్ ఇవి కాదు. కానీ.. నార్త్ అమెరికాలో కేవలం ప్రీమియర్స్ నుంచి రెండు మిలియన్ డాలర్ల క్రాస్ వస్తుందని మొదట అంతా భావించారు.
కనీసం డాకుమహరాజ్ సినిమాకు వచ్చిన ప్రీమియర్ షోల కలెక్షన్ కూడా అఖండ 2కు అడ్వాన్స్ బుకింగ్స్ లో వస్తుందా.. లేదా.. అనే కన్ఫ్యూజన్ ఇప్పుడు మొదలైందట. డాకు మహారాజ్‌కి యూఎస్ఏ ప్రీవియర్స్ నుంచి మూడు లక్షల 50 వేల డాలర్లు దక్కాయి. ఈ క్రమంలోనే అఖండ తాండవంకు అంతకు డబల్ కలెక్షన్స్ వస్తాయని అంతా భావించారు. కానీ.. ప్రస్తుతం ఓపెన్ బుకింగ్ కలెక్షన్స్ చూస్తుంటే.. ఈ సినిమాకు నాలుగు లక్షల డాలర్ల నుంచి ఒక్క పైసా కూడా కలెక్షన్సే వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. పైగా.. సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. 3d వర్షన్లో కూడా.. మార్చి రిలీజ్ చేయబోతున్నారు. ఇలాంటి టైంలో.. సినిమాకు అసలు ఎలాంటి హైప్ లేకపోవడం.. ఓపెన్ బుకింగ్స్ కూడా ఇంత డల్‌గా ఉండడం బిగ్ షాక్ అనే చెప్పాలి. కానీ.. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మాత్రం భారీ ఓపెనింగ్స్ దక్కే అవకాశం ఉంది.



