ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో మైథాలజికల్ జానార్ల ట్రెండ్ నడుస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు పలు సినిమాలు తెరకెక్కి మంచి సక్సెస్ అందుకున్నాయి. ఇప్పుడు కూడా.. కొన్ని సినిమాలు షూట్ దశలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమాలన్నీ సర్వే గంగా షూట్ పూర్తి చేసి.. వచ్చేయడాది థియేటర్స్ లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్టులలో మోస్ట్ అవైటెడ్.. భారీ సినిమాలు.. బాలీవుడ్ రామాయణ్, టాలీవుడ్ వారణాసి. ఇతిహాసం రామాయణం ఆధారంగా ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న రామాయణ్‌కు నితీష్ తివారి దర్శకడగా వ్యవహరిస్తున్నారు. ఇది రెండు భాగాలుగా రిలీజ్ కానుంది. అదే టైంలో.. సౌత్ ఇండస్ట్రీ నుంచి వారణాసి రూపొందుతుంది.
/odishatv/media/post_attachments/uploadimage/library/16_9/16_9_0/recent_photo_1743930776.webp)
ఈ మూవీలో మైథాలజితో పాటు.. టైం ట్రావెల్, సైన్స్ ఫిక్షన్ టచ్ ఇస్తూ డిజైన్ చేస్తున్నాడట రాజమౌళి. ఏదేమైనా.. అటు రామాయణ్, ఇటు వారణాసి రెండు సినిమాలు భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాలే కావడం.. రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉండడంతో.. ఆడియన్స్‌లో ఈ సినిమాలపై భారీ బజ్ నెలకొంది. ఇక.. రీసెంట్‌గా రిలీజ్ అయిన గ్లింప్స్‌తో సినీ ఆడియన్స్‌లో అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. కాగా.. ఈ రెండు సినిమాలు 2027 లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రెండు సినిమాల రిలీజ్‌పై కంపారిజన్లు మొదలయ్యాయి. రామాయణంలో ఓ ప్రధాన ఘట్టని వారణాసి కోసం రాజమౌళి తీసుకున్నట్లు ఇప్పటికే గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్లో క్లారిటీ ఇచ్చేసాడు.

దీంతో.. రెండు సినిమాలను కంపేర్ చేస్తూ.. నెటిసన్స్ వేస్తున్న ప్రశ్నలు మేకర్స్‌కు సవాల్‌గా మారాయి. అటూ రామాయణ్, ఇటు వారణాసి రెండు సినిమాల దర్శకులు మంచి టాలెంట్ ఉన్నవాళ్లు.. రామాయణ్ మూవీతో విజువల్ వండర్‌ను ప్రేక్షకులు ముందుకు తీసుకురావడానికి నితీష్ ప్లాన్ చేస్తున్నాడు. ఇక రాజమౌళి సినిమా అంటేనే ఓ పద్ధతి, ప్లానింగ్ అనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికే బాహుబలి సిరీస్‌లతోపాటు.. ఆర్ఆర్ఆర్‌తో వరల్డ్ వైడ్‌గా తన మార్క చూపించాడు. ఇప్పుడు.. వారణాసితో ఆడియన్స్‌ను అదే రేంజ్ లో ఆకట్టుకుంటాడని నమ్మకం అభిమానుల్లో నెలకొంది. కనుక.. ఇటు రామాయణ్, అటు వారణాసి సినిమాల రిలీజ్ తర్వాత ఏం జరుగుతుందో వేచి చూడాలి.

