రాజమౌళి తర్వాత మహేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో ఎస్ఎస్ఎంబి 29 పనుల్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే.. నాలుగు స్కెడ్యూలను పూర్తిచేసుకున్న ఈ సినిమా.. టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టేజ్ బిగ్ బడా ప్రాజెక్టుగా రూపొందుతుంది. కేవలం పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్ మార్కెట్ టార్గెట్ చేస్తూ.. జక్కన్న సినిమాను రూపొందిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా సినిమా తెర‌కెక్కుతున్న క్రమంలో సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ కూడా బయటకు రాకుండా చాలా సీక్రెట్ మైంటైన్ చేస్తున్నాడు. అయితే.. ఈ సినిమాకు సంబంధించిన ఎదైన‌ అప్డేట్ వస్తే బాగుండ‌ని ఫ్యాన్స్ కళ్ళు కాయలుకాచేలా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఆ సమయం ఎట్టకేలకు వచ్చేసింది. నవంబర్ 15న అంటే మరో రెండు రోజుల్లో సినిమాకు సంబంధించిన పలు కీలక అప్డేట్స్ మేకర్స్ రివీల్‌ చేయనున్నారు.

గ్లోబల్ ట్రాట‌ర్ పేరుతో.. బడా ఈవెంట్ ప్లాన్ చేసిన జక్కన్న.. ఈ ఈవెంట్‌లోను సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్స్ ను రివిల్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. అంతేకాదు.. ఈవెంట్ పై కూడా ఆడియన్స్‌లో మంచి బజ్‌ క్రియేట్ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే.. తాజాగా సినిమాలో నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్‌, ప్రియాంక చోప్రా లుక్స్ రివిల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్ట‌ర్‌ల‌కు ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా.. సినిమా రిజల్ట్ లో మాత్రం ఎలాంటి తేడా ఉండదని.. బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమంటూ ఫ్యాన్స్ ధీమో వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఇలాంటి క్రమంలోనే మహేష్ ఎస్ఎస్ఎంబి 29 లాంటి పాన్ వరల్డ్ ప్రాజెక్టులు నటించిన తర్వాత ఏ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడని టాక్ హాట్ టాపిక్‌గా మారింది.

రాజమౌళి లాంటి లెజెండరీ డైరెక్టర్‌తో పని చేసిన మహేష్.. రొటీన్ కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో తన నెక్స్ట్ సినిమాను కూడా.. అదే లెవెల్ లో ఉండేలా మహేష్ ప్లాన్ చేయాల్సి ఉంది. ఈ క్రమంలోనే.. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఎంచుకున్నాడు అంటూ టాక్ వైరల్ గా మారుతుంది. గతంలోనే సందీప్ మహేష్ కాంబోలో ప్రాజెక్ట్ దాదాపు ఖరారు అయింది. కానీ కొన్ని కారణాలతో అది వర్కౌట్ కాలేదు. ప్రస్తుతం ప్రభాస్ తో స్పిరిట్ పనుల్లో సందీప్ బిజీ బిజీగా గడుపుతున్నాడు. పెద్ద స్టార్స్ తో బడా ప్రాజెక్టులను హ్యాండిల్ చేయడంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్లో క్రియేట్ చేసుకున్నాడు సందీప్. దీంతో మహేష్.. తన నెక్స్ట్‌ ప్రాజెక్ట్ ను సందీప్త చేయాలని ఫ్యాన్స్ సైతం కోరుకుంటున్నారు. మరి.. మహేష్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడో.. ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరో చూడాలి.