టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ రాజాసాబ్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ గా తరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మారుతి డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు రిలీజ్‌కు సిద్ధమవుతుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికీ అఫీషియల్‌గా ప్రకటించారు మేకర్స్. అయితే.. గత కొద్దికొద్ది రోజులుగా సినిమాలోని పలు సీన్స్ రీ షూట్ చేస్తున్నారని.. దీంతో మరోసారి సినిమా వాయిదా పడుతుందంటూ వార్తలు తెగ వైరల్ గా మారుతున్నాయి.
![]()
ఈ క్రమంలోనే.. తాజాగా మూవీ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అవుతూ.. ఈ వార్తలన్నింటికీ చెక్ పెట్టాడు. పండగకు వస్తున్నాం.. పండగ చేస్తున్నాం అంటూ క్లారిటీ ఇచ్చారు. దీంతో పుకార్లకు ఎండ్ కార్డ్ పడింది. అయితే.. ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ముగ్గురు హీరోయిన్స్ మెరువనున్నారు. నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్ది కుమార్‌తో ప్రభాస్ రొమాన్స్ ఏ రేంజ్‌లో ఉండబోతుందో అనే ఆసక్తి ఫ్యాన్స్ లో మొదలైంది. ఇటీవల కాలంలో.. ప్రభాస్‌ను ఓ యోధుడిగా, యాక్షన్ హీరోగా మాత్రమే ఫ్యాన్స్ చూస్తున్నారు.

దీంతో వింటేజ్ ప్రభాస్ కోసం ఎంతోమంది ఎదురుచూస్తున్నారు. ఇక ది రాజాసాబ్‌తో మళ్ళీ పాత డార్లింగ్ కనిపించబోతున్నాడు అంటూ ఆసక్తి అభిమానులు మొదలైంది. శరత్ బాబు మూవీలో కీలకపాత్రలో మెరవనున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను.. యూవీ క్రియేషన్స్, ఎస్కేఎన్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ప్రభాస్ నుంచి వస్తున్న మొట్టమొదటి హారర్ కామెడీ జోనర్ మూవీ కావడంతో.. ఆడియన్స్‌లో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే.. ఫ్యాన్ సినిమా అప్డేట్ల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక.. తాజాగా సినిమా నుంచి ట్రైలర్, టీజర్, పోస్టర్ వీడియోలు తెగ ట్రెండింగ్‌గా మారాయి.

