టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి పాన్ ఇండియా లెవెల్‌లో తిరుగులేని ఇమేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. బాహుబలి, ఆర్‌ఆర్ఆర్ సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని రెట్టింపు చేసిన జక్కన్న.. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా ఎస్ఎస్ఎంబి 29 సినిమాను రూపొందిస్తున్నాడు. ఇక.. ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో కాదు.. పాన్ వరల్డ్ రేంజ్‌లో తన సత్తా చాటుకోవాలని సిద్ధమయ్యాడు. ప్రపంచవ్యాప్తంగా స్టార్ దర్శకులుగా రాణిస్తున్న వారి లిస్టులో జక్కన్న చేరాలని ఆరాటపడుతున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు రాజమౌళి తీసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే.. మహేష్ నుంచి రానున్న ఈ సినిమా మరో ఎత్తు అంటూ టాక్ తెగ వైరల్ గా మారుతుంది.

ఇక సినిమాలో పృథ్వీరాజ్ విలన్ గా నటిస్తుండగా.. ప్రియాంక చోప్రా మరో ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఈ క్రమంలోనే తాజాగా సినిమా పై హైప్ క్రియేట్ చేసేందుకు జక్కన్న.. పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్‌ను రివిల్ చేశాడు. ఈ లుక్ పై సోషల్ మీడియాలో పలు విమర్శలు సైతం ఎదురయ్యాయి. అయితే.. తాజాగా సినిమా స్టోరీ కూడా లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ స్టోరీ ఏంటంటే.. కుంభ అనే దుర్మార్గుడు ఫిజికల్ గా హ్యాండీక్యాప్డ్ గా కనిపిస్తాడు. ఇతనికి మొదటి నుంచి ప్రపంచాన్ని చుట్టేయాలని కోరిక ఉంటుంది. ఇక అప్పటికే హీరో ప్రపంచం చుట్టేస్తూ.. నేచర్ ను ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే తనకు కూడా ప్రపంచాన్ని పరిచయం చేయమని హీరోను అడగగా అతను నో చెప్పేస్తాడు.
దీంతో.. విలన్ సిస్టర్ అయిన ప్రియాంక చోప్రా.. మహేష్ బాబుకి ప్రేమ పేరుతో దగ్గరై.. వాళ్ళ బ్రదర్ ని ప్రపంచం మొత్తం తిప్పడానికి మహేష్ బాబును ఒప్పిస్తోంది. ఇక తర్వాత కుంభ అసలు కోరిక ప్రపంచాన్ని చూడడం కాదు.. తనకు కావాల్సిన ఎన్నో ఔషధాలను తన ఆధీనం చేసుకోవడం.. ఆ ఔషధాలతో తన అంగవైకల్యాలు పోగొట్టుకొని.. ప్రపంచాని నాశనం చేయడం అని. ఈ క్రమంలోనే అలాంటి కొన్ని ఔషద గుణాలు ఉన్న మూలికల కోసం సెర్చింగ్ చేస్తూ ఉంటాడు కుంభ. ఇక కుంభ సాధారణ మనిషిలా మారిన తర్వాత.. ప్రపంచాన్ని నాశనం చేసే పన్నాగం పన్నుతాడు. ఇది తెలుసుకున్న హీరో.. తనను ఎలా అడ్డుకున్నాడు అనేదే స్టోరీ అట.

