పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్.. సలార్, కల్కి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత.. ది రాజాసాబ్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. మారుతి డైరెక్షన్‌లో కామెడీ హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా.. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో జనవరి 9న రిలీజ్ కానుంది. పాన్ ఇండియా లెవెల్లో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్న ఈ సినిమాపై.. ఇప్పటికే మంచి హైప్ నెలకొంది. అయితే.. గత కొద్ది రోజులుగా సినిమా విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం నిరాశ వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ సినిమాకు సంబంధించిన కనీసం ఏ చిన్న అప్డేట్ కూడా రివిల్ చేయడం లేదని.. సినిమా రిలీజ్ కు మరో 2 నెలలు మాత్రమే గ్యాప్ ఉన్నా.. కనీసం సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ కూడా రాలేదంటూ తెగ ఫీల్ అయిపోతున్నారు.
థమన్ పనిచేస్తున్న ఏ సినిమాకైనా.. ఆరు నెలల ముందే సందడి మొదలు పెట్టేస్తాడు. ప్రమోషన్స్ పనులు తన భుజాల పైనే ఉంచుకొని ఏదో ఒక ఇంట్రెస్టింగ్ ఫిట్‌తో ఆడియన్స్‌లో హైప్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. అలాంటి థమన్ సైతం రాజాసాబ్‌ను పట్టించుకోవడం మానేసాడని.. కనీసం సినిమా ఫస్ట్ సింగిల్ కు సంబంధించిన అప్డేట్ ను కూడా ఇవ్వడం లేదంటూ ఫైర్ అయ్యారు. ఇలాంటి క్రమంలోనే.. సినిమాకు సంబంధించిన అప్డేట్‌లు మేకర్స్ రివీల్ చేశారు. గత కొద్ది రోజులుగా.. ఈ సినిమా విఎఫ్ఎక్స్ కంప్లీట్ కాలేదని.. అందుకే సంక్రాంతి బరిలో కూడా సినిమా వాయిదా పడిపోతుందంటూ వార్తలు వినిపించాయి. దీనిపై టీం రియాక్ట్ అవుతూ.. ఈ వార్తలను ఖండించారు. జనవరి 9న ఎట్టకేలకు సినిమా రిలీజ్ అవుతుందని వెల్లడించారు.

ఇక సినిమా ఫస్ట్ సింగిల్ పై థమన్ తాజాగా రియాక్ట్ అయ్యారు. తన సోషల్ మీడియా వేదికగా ముచ్చటిస్తూ.. రాజాసాబ్ ఫస్ట్ సింగల్ అప్డేట్ ఒక్క వారం వ్యవధిలోనే రివీల్ చేయబోతున్నామని చెప్పుకొచ్చాడు. అలాగే.. మూడు సాంగ్స్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేస్తామని వివరించాడు. ఈ విషయంలో ఫ్యాన్స్ ఎవరు నిరాశ చెందవద్దని.. ఎలాంటి నెగిటివిటీని పెంచవద్దని కోరుకున్నాడు. ఈ సినిమా ఖచ్చితంగా ఫ్యాన్స్ కు మంచి వినోదాన్ని పంచుతుందని.. ధీమా వ్యక్తం చేశాడు. ఇక సినిమా జనవరి 9న రిలీజ్ కానున్న క్రమంలో.. ప్రమోషన్ కార్యక్రమాలు త్వరలోనే ప్రారంభించనున్నారు టీం. ఈ సినిమా ప్రమోషన్స్‌ను కూడా.. గ్లోబల్ లెవెల్ లో నిర్వహించినట్లు సమాచారం. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ క్రిస్మస్ పండుగను సెలబ్రేట్ చేసుకుంటూ.. యూఎస్‌లో నిర్వహించనున్నారట. అలాగే.. జనవరి 1న ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.


