అల్లు అర్జున్ నెక్స్ట్.. అట్లీ తర్వాత ఆ ముగ్గురు తోపు డైరెక్టర్ల‌తో డీల్ ..!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప సిరీస్‌లతో తిరుగులేని ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. పుష్ప 3తో ఏకంగా రూ.1800 కోట్ల గ్రాస్ కొల్లగొట్టిన బన్నీ.. ఈ సినిమాతో నేషనల్ కాదు ఇంటర్నేషనల్ లెవెల్ లో ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ లన్ని పాన్ వరల్డ్, గ్లోబల్ లెవెల్ లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నాడు. ఇందులో భాగంగానే.. పుష్ప 2 తర్వాత.. మొదట త్రివిక్రమ్‌తో సినిమా చేయాలనుకున్న ఆయనను పక్కన పెట్టేసి మరి.. తమిళ్ డైరెక్టర్ అట్టీని చూజ్‌ చేసుకున్నాడు బన్నీ.

జవాన్ లాంటి పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ తర్వాత.. అల్లు అర్జున్ హీరోగా రూపొందిస్తున్న సినిమా ఇది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై.. ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఏకంగా రూ.700 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. ఇక.. ఈ సినిమా విఎఫ్ఎక్స్ కు భారీ ప్రాధాన్యత ఇచ్చినట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఇక సినిమాకు ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్‌ మెయింటైన్ చేయాలని మేకర్స్‌ ఫిక్స్ అయ్యారట. పాన్ వరల్డ్ రేంజ్‌లో సినిమాను రూపొందిస్తున్న క్రమంలో.. ఈ సినిమా కోసం అమెరికాలో పేరు ఉన్న వార్నర్ బ్రదర్స్ సినిమా కోసం అప్రోచ్ అయినట్లు తెలుస్తుంది.

Allu Arjun to collaborate with Sanjay Leela Bhansali and SS Rajamouli?  Details inside - India Today

ఇదిలా ఉంటే బన్నీ.. అట్లీ తర్వాత మరో ముగ్గురు తోపు డైరెక్టర్లను లైన్‌లో పెట్టుకున్నాడు అంటూ ఓ క్రేజీ న్యూస్ వైరల్ గా మారుతుంది. ఈ క్రమంలోనే.. బన్నీ లైనప్‌ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే అంటూ అభిప్రాయాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. ఇక.. అట్లీ సినిమా తర్వాత బన్నీ డైరెక్టర్ రాజమౌళితో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట. రాజమౌళి తర్వాత సంజయ్ లీలా భ‌న్సాలి, ఆ తర్వాత ప్రశాంత్ నీల్‌ డైరెక్షన్‌లో సినిమాలు తెర‌కెక్క‌నున్నాయని.. అవి కూడా ఇంటర్నేషనల్ లెవెల్ లోనే రూపొందించనున్నట్లు సమాచారం. ఏదేమైనా ప్రస్తుతం బన్నీ వరుస స్ట్రాంగ్ ప్రాజెక్ట్‌లతో తిరుగులేని లైనప్‌ సిద్ధం చేసుకుంటూ దూసుకుపోతున్నాడు.

Prashanth Neel confirms new film with Allu Arjun: 'But it will take time as  both are busy'