బాలయ్య కోసం విలన్ గా టాలీవుడ్ స్టార్ హీరో.. గోపీచంద్ మాస్టర్ స్కెచ్..!

టాలీవుడ్ నందమూరి నట‌సింహం బాలకృష్ణకు ప్రస్తుతం గుడ్ టైం నడుస్తుంది. ఆయన సినిమాల పరంగా, రాజకీయ పరంగా.. బుల్లితెరపై హోస్టింగ్‌తోను వరుసగా సక్సెస్‌లు అందుకుంటూ రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. ఆయన బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో అకండ 2 తాండవంతో బిజీబిజీగా గడుపుతున్నాడు. ఇక సినిమా షూట్ తుది ద‌శ‌కు చేరుకుందని సమాచారం. అఖండ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్‌కు సీక్వెల్ కావడం.. బాలయ్య సూపర్ హిట్ కాంబోలో తెర‌కెక్కుతున్న నాలుగవ‌ సినిమా కావడంతో.. ఈ సినిమాపై ఆడియన్స్ లో మొదటి నుంచే భారీ అంచనాలు నెల‌కొన్నాయి. ఆ అంచ‌నాల‌కు తగ్గట్టుగానే.. సినిమాను కూడా బోయపాటి చాలా పవర్ఫుల్‌గా డిజైన్ చేస్తున్నాడట.

Balakrishna - Ravi Teja : రవితేజను ఆ విధంగా విడిచిపెట్టని బాలకృష్ణ.. నట  సింహా Vs మాస్ మహారాజ్.. | సినిమా - News18 తెలుగు

బాలయ్య స్టైలిష్ లుక్‌, ఎలివేషన్, డైలాగ్స్, మాస్‌ స్క్రీన్ ప్రజెన్స్‌ అన్ని ఫాన్స్ లో సరికొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ క్ర‌మంలోనే బాలయ్య నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా ఇప్పటికీ అఫీషియల్ గా ప్రకటించారు. ఇక టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ గోపీచంద్ మల్లినేని డైరెక్షన్‌లో పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్‌లో నటించబోతున్నట్లు వివరించిన సంగతి తెలిసిందే. క్రాక్, వీర సింహారెడ్డి లాంటి మాస్ హిట్స్ అందుకున్న గోపీచంద్.. బాలయ్యను ఈ సినిమాలో ఏ రేంజ్ లో ఎలివేట్ చేస్తాడు చూడాలి. ఇక ఇప్పటికే వీళ్లిద్దరు కాంబోలో వీర సింహారెడ్డి హిట్‌గా నిలవడంతో.. ఇది ఫ్యాన్స్ కు డబల్ ట్రీట్ లాంటిదని చెప్పాలి. ఇక ఈ సినిమా కోసం.. గోపీచంద్ మాస్ ప్లానింగ్ అదిరిపోయింది. అసలు మ్యాటర్ ఏంటంటే.. సినిమాలో బాలయ్యకు విలన్ గా.. మరొక స్టార్ హీరోని రంగంలోకి దింపేందుకు సిద్ధమయ్యడట గోపీచంద్. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు.. టాలీవుడ్ మాస్ మహారాజ్‌ రవితేజ.

Balakrishna and Gopichand Malineni reunite for a historic action film | The  Pioneer

బాలయ్య వర్సెస్ రవితేజ ఈ మాస్ కాంబినేషన్ వింటేనే అభిమానుల్లో సరికొత్త ఉత్సాహం మొదలవుతుంది. ఇక వీళ్లిద్దరూ ఒకే స్క్రీన్ పై తలపడితే ఫ్యాన్స్‌కు ఏ రేంజ్‌లో హైప్‌ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలయ్య మాస్, రవితేజ ఎనర్జీ కలిస్తే ఈ సినిమా బాక్సాఫీస్ బ్లాస్ట్ అవ్వడం ఖాయం అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక.. గోపీచంద్.. రవితేజను విలన్ గా చూపించడంతో కొత్త రుచిని సినిమాకు తీసుకురావాలని భావిస్తున్నాడట. బాలయ్యకు ఎదురు అంతే స్ట్రాంగ్ గా నిలబడే సమానమైన విలన్ కావాలని.. యాస్ ఎనర్జీ ఉన్న నటుడు అయితే పర్ఫెక్ట్ గా ఉంటుందని ఉద్దేశంతో రవితేజను రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే మరోసారి బాలయ్య, గోపీచంద్ కాంబోకు ఆడియన్స్‌లో హైప్‌ క్రియేట్ అయింది. ఇక రవితేజ సినిమాలో విలన్‌గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా.. లేదా తెలియాలంటే ఆఫీషియ‌ల్‌ ప్రకటన రావాల్సిందే.