టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడికి ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనిల్ రావిపూడి మొదట రైటర్‌గా.. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా.. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్గా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. కాగా.. అనిల్ కు తన కెరీర్ ప్రారంభం నుంచి కొందరితో ఏర్పడిన పరిచయాలు గొప్ప స్నేహాలుగా ఇప్పటికీ మిగిలిపోయాయట. కొంతమంది బెస్ట్ ఫ్రెండ్స్‌గా మారి ఇప్పటికే లైఫ్ లో అలా ఉండిపోయారు.

అలాంటి వారిలో కమెడియన్ సప్తగిరి ఒకరు. అనిల్‌కు.. సప్తగిరి మొదటి నుంచి మంచి ఫ్రెండ్. ఆ ఇద్దరు కలిసి అసిస్టెంట్ డైరెక్టర్‌లుగా పనిచేశారు. ఆ తర్వాత సప్తగిరి నటుడుగా కెరీర్ సెట్ చేసుకుంటే.. అనిల్ డైరెక్టర్‌గా మారి.. స్టార్ ఇమేజె సొంతం చేసుకున్నాడు. అలానే.. అనిల్‌కు ఇండస్ట్రీలో మరో కమెడియన్ క్లోజ్ ఫ్రెండ్‌గా ఉంటాడట. అతను మరెవరో కాదు అదిరే అభి. ఈ విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అభి తనకు క్లోజ్ ఫ్రెండ్ అంటూ అనిల్ స్వయంగా ఓ సందర్భంలో రివిల్ చేశాడు.

గౌతమ్ ఎస్ఎస్సి సినిమా కోసం అసిస్టెంట్ డైరెక్టర్‌గా అనిల్ పని చేశాడు. అందులో అదిరే అభి ఓ పాత్రలో మెరిసాడు. అక్కడే వీళ్ళిద్దరికీ పరిచయం ఏర్పడిందట. అలా మొదలైన స్నేహం.. బెస్ట్ ఫ్రెండ్ షిప్ గా మారిపోయిందని చెప్పుకొచ్చాడు. కందిరీగ సినిమాలో తెలంగాణ యాసలో డైలాగులు రాసే టైంలో అభి నాకు ఎంతగానో హెల్ప్ చేశాడని అనిల్ వివరించాడు. ఇక అదిరా అభి మొదట నటించిన సినిమాల కంటే జబర్దస్త్ లో కమెడియన్గా ఎక్కువ పాపులారిటి తెచ్చుకున్న సంగతి తెలిసిందే. చాలా కాలం జబర్దస్త్ లో టీం లీడర్ గా కొనసాగిన అభి.. తర్వాత జబర్దస్త్‌కు గుడ్ బై చెప్పేసాడు. ప్రస్తుతం అడపదడప సినిమాల్లో నటిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు.

