స్పిరిట్ షూట్ షురూ.. విలన్ గా కొరియన్ స్టార్ డాన్‌లీ ఫిక్స్..!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూపులకు ఎట్టకేలకు తెర‌ప‌డింది. అర్జున్ రెడ్డి, యానిమల్ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్‌ల తర్వాత సందీప్ రెడ్డి వంగ ప్రభాస్‌తో తెర‌కెక్కించనున్న భారీ యాక్షన్‌, ఎమోషనల్ మూవీ స్పిరిట్. రెగ్యులర్ షూట్ తాజాగా ప్రారంభమైంది. దాదాపు.. రెండేళ్ల క్రితం అఫిషియల్ గా అనౌన్స్ చేసిన ఈ ప్రాజెక్ట్‌.. ప్రభాస్ వరుస కమిట్మెంట్స్ కారణంగా ఆలస్యం అవుతూ వచ్చింది. ఇప్పుడు.. సింపుల్‌గా పూజ కార్యక్రమం ముగించి సెట్స్‌పైకి తీసుకు వెళ్ళాడు సందీప్.

Prabhas to share screen with South Korean actor Don Lee in upcoming film ' Spirit': Reports - Bold News

ఈ క్రమంలోనే రిలీజ్ అయిన అప్డేట్స్ ఆడియన్స్‌లో అంచనాలను తారస్థాయికి తీసుకెళ్లాయి. స్పిరిట్ ప్రాజెక్ట్ మరో ఇంటర్నేషనల్ టచ్ తోడైంది. కొద్ది కాలంగా ప్రచారంలో ఉన్నట్లే.. ప్రముఖ కొరియన్ – అమెరిక‌న్‌ యాక్టర్ డాంగ్ – సియోక్ (డాన్ లీ).. ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించనున్నట్లు అఫీషియల్ క్లారిటీ వచ్చేసింది. ట్రైన్ టు బుస్సాన్, ఎటర్నల్స్ లాంటి గ్లోబల్ హిట్ సినిమాలతో మంచి పాపులారిటీ త‌క్కించుకున్న డాన్‌లీ స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా కొత్త ప్రయాణం ఇప్పుడే మొదలైంది.. # స్పిరిట్ అంటూ పోస్ట్ షేర్ చేసుకుని ఆడియన్స్ లో మరింత ఉత్సాహాన్ని పెంచాడు.

Happy Birthday Sandeep Reddy Vanga 🔥 @sandeepreddy.vanga #akrmemes  #sandeepreddyvanga

ఈ సినిమాలో డాన్‌లీ పవర్ఫుల్ విలన్ గా కనిపించనున్నట్లు మొదటి నుంచి వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ లాంటి.. మాస్ హీరోకు డాన్ లీ లాంటి ఇంటర్నేషనల్ యాక్షన్ స్టార్ విలన్ గా వస్తే.. ఆ సినిమా పాన్ ఇండియా లెవెల్లో కాదు.. గ్లోబల్ లెవెల్లో యాక్షన్ ఫిలిం గా మారుతుందని.. సందీప్ ఇలా ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఇక సినిమాలో ప్రభాస్ ఓ ప‌వర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. మొట్టమొదటిసారి పూర్తిస్థాయి ఐపీఎస్ ఆఫీసర్గా మెరవనున్నాడు.