టాలీవుడ్ దర్శకధీరుడుగా పాన్ ఇండియాలో తిరుగులేని ఇమేజ్ క్రియేట్ చేసుకున్న రాజమౌళి.. ప్రస్తుతం ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్‌తో దూసుకుపోతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. ప్రస్తుతం ఈ రేంజ్‌లో రాజమౌళి సక్సెస్ అవ్వడానికి ప్రధాన కారణం ఆయన ప్లానింగ్, కష్టం. అలాగే.. తనతో పాటు ఇతర నటీనటులను కూడా సినిమా కోసం అంతే కష్టపెడుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే తను తెరకెక్కించిన ప్రతి సినిమా అవుట్ ఫుట్ ఆడియన్స్ను ఆకట్టుకుని.. బ్లాక్ బస్టర్ గా నిలుస్తుంది. అయితే.. రాజమౌళి సినీ కెరీర్‌లో జీరో నాలెడ్జ్‌తో తెరకెకం్కించి.. బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమా ఒకటి ఉందట. ఈ సినిమా వెనుక చాలా టెన్షన్, కష్టం ఉందని రాజమౌళి స్వయంగా వివరించాడు. ఇంతకీ అసలు ఆ సినిమా మరెదో కాదు ఈగా. రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో స్వయంగా ఈ మ్యాటర్ చెప్పుకొచ్చాడు.
![]()
ఈ సినిమా తీసే సమయానికి రాజమౌళికి యానిమేషన్, గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ బేసిక్ నాలెడ్జ్ కూడా లేదట. అసలు వీటిని ఎలా చేయాలో కూడా ప్లానింగ్ లేదట. ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా వివరిస్తూ.. ఈగ మూవీ విజువల్ ఎఫెక్ట్ బాధ్యతని మకుట అనే సంస్థకు నేను అప్పగించా. ఈగను డిజైన్ చేసి సినిమా షూట్ చేస్తే ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్లో వాళ్లు విజువల్ ఎఫెక్ట్స్ పెడతారని చెప్పారు. కనీసం అవగాహన కూడా నాకు లేదంటూ వివరించాడు. దీంతో ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఈగ ఎలా ఉంటుంది.. దాని మూమెంట్స్ ఎలా ఉంటాయి అనేది డిజైన్ చేసి చూపించమని వాళ్ళని అడిగాం. వాళ్ళు ఆరు నెలలు కష్టపడి.. కొన్ని ఫొటోస్ తయారు చేశారు.
![]()
ఆ ఫొటోస్ చూసిన వెంటనే నా గుండె జారిపోయింది. అస్సలు బాలేదు. ఇక పరమ అసహ్యం.. ఈగలా లేదు.. ఏదో రోబోట్ నడిచినట్లుగా ఉంది. ఏదైనా చిన్న అంశం బాగున్న దాని నుంచి డెవలప్ చేయొచ్చు అనుకుంటే ఇదేంటి ఇలా ఉంది.. ఇప్పటికే సినిమా కోసం రూ.10 కోట్లు ఖర్చు అయిపోయాయి. కనీసం కోటి రూపాయలే ఖర్చై ఉన్న.. సినిమా ఆపేసే వాడినని ఎంతో టెన్షన్ పడ్డా. ఇప్పుడు వెనక్కి వెళ్ళలేని పరిస్థితి.. మకుట వాళ్లని అడిగితే అసలు ప్రీ ప్రొడక్షన్ అనేది మా పనే కాదని చెప్పేసి మీరు డిజైన్ చేసిస్తే మేము దానిపై పని చేస్తామన్నారు. నాకు దిమ్మ తిరిగిపోయింది. రెండు రోజులు బాధపడ్డ. ఏదైతే అది అయిందని మళ్లీ రీ వర్క్ ప్రారంభించా.. ఇప్పుడు చేస్తున్న ప్రాసెస్ కరెక్ట్ కాదు అని భావించి.. నిజమైన ఈగ ఎలా ఉంటుందో పరిశీలించాలని ఫిక్స్ అయ్యా. కొందరు కాన్సెప్ట్ ఆర్టిస్టులను కలిసి వాళ్ళ సలహాలు తీసుకున్నా.
నిజమైన ఈగల్ని ఫోటోషూట్ చేయాలని అనుకున్న. అవి ఎక్కువసేపు ఎక్కడ ఉండవు. ఎగిరిపోతాయి. దానిని బాగా క్లోజప్గా ఫోటోలు తీయాలంటే పవర్ఫుల్ లెన్స్ ఉండాల్సిందే. అప్పుడు కూడా అది ఎక్కువ సేపు నిలిచి ఉండదు. ఈ క్రమంలోనే సెర్చ్ చేస్తే.. ఈగలని పట్టుకుని వాటిని ఫ్రిజ్లో కొంత సమయం పెడితే అవి స్పృహ కోల్పోతాయి. లేదా వేగంగా కదలలేవని తెలుసుకున్నా. దాంతో కొన్ని ఈగలు పట్టుకొని ఫ్రిజ్లో పెట్టేసాం. అవి కదలని స్థితిలోకి వెళ్లాక బయటకు తీసి ఫోటో షూట్ చేపించాం. అప్పుడు కూడా కెమెరా ఆన్ చేస్తే ఆ హీట్ కు యాక్టివ్ అయిన ఈగలు చాలా వరకు వెళ్లిపోయేవి. అలా.. సినిమా షూట్ కోసం ఈగలను చిత్రహింసలు పెట్టి మొత్తానికి పూర్తి చేశా. అప్పుడు ఈగ ఒరిజినల్ గా కలర్ ఎలా ఉంటుంది.. అది స్లోగా కదిలినప్పుడు మూమెంట్స్ ఎలా ఉంటాయి.. ఇలా అని చూసి.. అప్పుడు సినిమాలో ఉన్న ఈగని డిజైన్ చేసామంటూ రాజమౌళి వివరించాడు. ఇక ఈగను డిజైన్ చేయడానికి జక్కన్న పడిన కష్టం, టెన్షన్ వర్కౌట్ అయ్యాయి. అవుట్‌పుట్ చాలా బాగా వచ్చింది. సినిమా బ్లాక్ బస్టర్ కొట్టింది.

