టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ఓజీ బ్లాక్ బస్టర్ సక్సెస్‌తో మంచి జోష్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక.. ఆయన నుంచి నెక్స్ట్ రాబోతున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ డైరెక్షన్‌లో పవన్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి ఆసక్తి నెలకొంది. పవన్, హరీష్ కాంబోలో గబ్బర్ సింగ్ లాంటి సూపర్ హిట్ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.
మళ్ళీ అదే మ్యాజిక్ ఉస్తాద్ భగత్ సింగ్‌తో రిపీట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఇక.. ఇప్పటికే సినిమాలో పవన్ కళ్యాణ్ షూటింగ్ పోర్షన్ అంత కంప్లీట్ చేసిన టీం.. ఇతర తారగణానికి సంబంధించిన సన్నివేశాలను హైదరాబాద్‌లో షూట్ చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో.. తాజాగా సినిమా రిలీజ్ డేట్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్‌గా మారుతుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డేను సెలబ్రేట్ చేసుకుంటూ సినిమాను గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారట.

ఇందులో వాస్తవం ఎంతో తెలియదు కానీ.. ప్రజెంట్ ఈ టాక్ వైరల్‌గా మారడంతో ఫ్యాన్స్ అంతా ఆనందని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అఫీషియల్ ప్రకటన కోసం వేచి చూస్తున్నారు. ఇక సినిమాలో పవన్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నారు. శ్రీ లీల, రాసి కన్నా, పార్ధీవన్, రవి కుమార్, ఎల్బి శ్రీరామ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా రూపొందుతుంది.


