ప్రభాస్ కు ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ట్యాగ్ ఇచ్చిన సందీప్ వంగా.. విషం కక్కుతున్న బాలీవుడ్..!

టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా.. ఏం చేసినా సంచలనమే. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, మానిమల్ సినిమాలు ఇప్పటికే భారతీయ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మార్క్‌ను క్రియేట్ చేసుకున్న సందీప్‌.. ప్రభాస్ స్పిరిట్‌తో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రభాస్ పుట్టిన రోజు సెలబ్రేషన్స్ లో భాగంగా తాజాగా స్పిరిట్ గ్లింప్స్ రిలీజ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ గ్లింప్స్‌ వీడియోలో ఫేస్‌లు చేయకుండా.. ప్రకాష్ రాజ్, ప్ర‌ఢీస్‌ వాయిస్‌తోనే ఆడియన్స్‌లో గూస్బంప్స్ తెప్పించాడు. ప్రభాస్‌కు ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అంటూ ట్యాగ్ తగిలించాడు సందీప్. దీంతో.. బాలీవుడ్ మీడియా విషం కక్కడం మొదలు పెట్టేసింది.

Sandeep Reddy Vanga's Open Challenge to Big Production House

ఎన్నో ఏళ్లుగా బాలీవుడ్‌ను ఏలుతున్న షారుక్ లాంటి సూపర్ స్టార్ ఉండగా.. ప్రభాస్ ని ఇండియన్ సూపర్ స్టార్ అని ఎలా అంటారంటూ సోషల్ మీడియాలో ఓవర్గం నెగిటివ్ కామెంట్లు మొదలుపెట్టేసారు. షారుక్ ఖాన్ కాకపోతే సల్మాన్ ఖాన్ కి ఇలాంటి ట్యాగ్ ఇచ్చిన ఒప్పుకుంటాం కానీ.. నిన్న కాక మొన్న పాన్ ఇండియన్ మార్కెట్‌కు పరిచయమైన ప్రభాస్‌ని ఇండియన్ సూపర్ స్టార్ అని ఎలా అంటున్నారు అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి పాన్‌ ఇండియా లెవెల్ లో క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. అంతకు ముందు కోట్ల షేర్ కష్టమనుకున్న టాలీవుడ్కు మొదటిసారి రూ.100+ క్రోస్ క్రాస్ పరిచయం చేసిన హీరో ప్రభాస్.

అయితే.. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన ఏ ఒక్క‌ సినిమా కూడా ఇప్పటిదాకా అన్ని ఏరియాలో లాభాలు తెచ్చిపెట్టి.. క్లీన్ హీట్ గా నిలవలేదు. షారుక్ ఖాన్ ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నారు. పఠాన్‌ సినిమాతో వెయ్యి కోట్ల కలెక్షన్ సైతం కొల్లగొట్టిన రికార్డ్ షారుక్ ఖాన్‌కు సొంతమైంది. అయితే.. సినిమా సక్సెస్ను బట్టి సూపర్ స్టార్ అనడం కూడా సరైనది కాదంటూ అభిప్రాయాలు వ్య‌క్త‌బ‌వుతున్నామి. ఈ సినిమా తర్వాత నటించిన షారుక్ న‌టించిన డంకీ, ప్రశాంత్ నీల్‌ డైరెక్షన్‌లో ప్రభాస్ హీరోగా వ‌చ్చిన‌ సల్లార్‌కు పోటీగా రిలీజ్ అయింది. ఇందులో డంకి రూ.400 కోట్లు రాగా.. స‌ల్లార్ రూ.720 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. అయితే.. డంకీ మ్యాట‌ర్‌లో చాలా తికమకలై నడిచాయి.

India's Biggest Superstar – Prabhas” Line from Sandeep Reddy Vanga's Spirit  Promo Divides the Internet –

సలార్‌కు థియేటర్లు ద‌క్క‌కుండా.. ఎన్నో ప్లాన్ చేసి భారీగా ఖర్చు పెట్టి మరి స్క్రీన్స్ బ్లాక్ చేసి.. డంకిని ఆడించారు. అయినప్పటికీ డంకీ సినిమా రిజ‌ల్ట్‌ని బట్టి.. షారుక్ ఖాన్ సూపర్ స్టార్ కాదు అనడం సరైనది కాదు. ఇద్దరికీ తోడు సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ కూడా బిగ్గె సూపర్ స్టార్ ఆఫ్ ఇండియా ట్యాగ్ కోసం తెగ కొట్టుకుంటున్నారు. ఈ ట్యాగ్ తమ హీరోకే దక్కుతుందంటూ.. మరోపక్క వార్‌ మొదలు పెట్టారు. అయితే.. ఇప్పటికే చాలా కాలం నుంచి సల్మాన్ కి ఒక్కసారైనా హిట్ కూడా లేదు. ఈ క్రమంలోని ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ట్యాగ్ విషయంలో బాలీవుడ్ మీడియా గగ్గోలు పెడుతుంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే.. బాక్స్ ఆఫీస్ నెంబర్లు, రివ్యూలతో సంబంధం లేకుండా.. కేవలం ఓపెనింగ్స్ తో వచ్చే కలెక్షన్స్ లెక్కకడితే మాత్రం.. ప్రభాస్‌కు ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ట్యాగ్ పర్ఫెక్ట్‌గా అడాప్ట్ అవుతుందంటూ ఫ్యాన్స్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.