టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన నుంచి నెక్స్ట్ రాబోతున్న సినిమా రాజాసాబ్. మారుతి డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా పై ఇప్పటికే ఆడియన్స్ లో మంచి హైప్ నెలకొంది. ఇక.. త్వరలోనే సినిమా పనులన్నీ పూర్తి చేసి రిలీజ్కు మేకర్స్ సిద్ధం చేయనున్నట్లు తెలుస్తుంది. ఇక.. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అఫీషియల్ గా ప్రకటించారు. కాగా.. ఈ సినిమా ప్రమోషన్స్ తో ఇప్పటినుంచి ఆడియన్స్లో హైప్ పెంచేలా మారుతి మాస్టర్ ప్లాన్ వేసాడట.
![]()
ఇప్పటికే సినిమా నుంచి ఓ ట్రైలర్ రిలీజై ఆడియన్స్ను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ఆడియన్స్ లో మరింత ఆసక్తిని పెంచేందుకు మూవీ యూనిట్ రెండో ట్రైలర్ను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట. ఇక.. ఈ ప్రమోషనల్ ట్రైలర్ కోసం డైరెక్టర్ మారుతి సరికొత్త విధానాన్ని అనుసరించబోతున్నాడని.. సాధారణ సినిమాల్లోలా మూవీలోని షార్ట్ ట్రైలర్ కట్ చేస్తి చూపించడం కాకుండా.. ఈ సినిమా కోసం రిలీజ్ చేయబోయే రెండో ట్రైలర్ వైవిధ్యంగా చూపించడానికి సిద్ధమవుతున్నాడని తెలుస్తుంది.

ఈ సెకండ్ ట్రైలర్ కోసం సినిమాలోని సీన్స్ కాకుండా.. స్పెషల్ షూట్ చేసి మరి రిలీజ్ చేసేలా భావిస్తున్నాడట. ఇక స్పెషల్ వీడియో ప్రమోషనల్ వీడియోలా కాకుండా.. పూర్తి లెవెల్ ట్రైలర్లా ఎఫెక్ట్ ను కలిగించేలా డిజైన్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ ఇదే వాస్తవం అయితే.. మారుతి రాజాసాబ్ ప్రమోషన్స్ తో కొత్త ట్రెండు ప్రారంభించినట్లు అవుతుంది. అయితే ఇది పూర్తిగా సరికొత్త స్ట్రాటజీ కావడంతో.. ఎలా వర్కౌట్ అవుతుందో.. ఆడియన్స్ లో ఏ రేంజ్ లో ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి.

