” మన శంకర వరప్రసాద్ గారు ” సెట్స్ లో వెంకి మామ.. ఫస్ట్ లుక్ వైరల్. .!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో మన శంకర వరప్రసాద్ గారు సినిమా షూట్ శ‌ర‌వేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో.. జనవరి 12న గ్రాండ్ లెవెల్లో ఈ సినిమా రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఇక.. సినిమాలో విక్టరీ వెంకటేష్ సైతం ఓ కీలక పాత్రలో మెరవ‌నున్నాడట‌. ఇప్పటికే.. ఈ విషయాన్ని వెంకటేష్‌తో పాటు.. మేకర్స్‌ సైతం వెల్లడించారు. కాగా.. త్వరలోనే వెంకటేష్ షూటింగ్‌లో సందడి చేయనున్నాడని.. మెగాస్టార్ చిరంజీవి కూడా పలు సందర్భాల్లో వివరించాడు. ఎట్టకేలకు ఆ టైం వచ్చేసింది. నిన్న సినిమా షూటింగ్‌లో వెంకటేష్.. మెగాస్టార్ చిరంజీవితో కలిసి సందడి చేశాడు.

Anil Ravipudi, Chiranjeevi's film Mana Shankara Vara Prasad Garu's release date | Regional-cinema News – India TV

దానికి సంబంధించిన వీడియో, ఫొటోస్ కొద్దిసేపటి క్రితం చిరు తన ట్విట్టర్ వేదికగా షేర్ చేసుకున్నాడు. ఈ వీడియోలో.. ఇద్దరు హీరోల పాత సినిమాలకు సంబంధించిన కొన్ని షాట్స్ ని ప్రారంభంలో చూపించి.. తర్వాత చిన్నగా వెంకటేష్‌కు సంబంధించిన గేన్ షాట్స్‌ను రిలీజ్ చేశారు. అప్పుడు.. చిరంజీవి వెల్కం మై డియర్ వెంకీ.. మై బ్రదర్ అంటూ కామెంట్స్‌ చేస్తాడు. చిరు సార్.. మై బాస్ అంటూ వెంకీ రియాక్ట్ అవుతాడు. ఆ వీడియో ఇద్దరి హీరోల అభిమానులకు ఒక బిగ్ ఫెస్టివల్లా అనిపించింది. ఎంత త్వరగా సంక్రాంతి సెలబ్రేషన్స్ మొదలైతే అంత బాగుండని ఫ్యాన్స్ ఆకాటపడుతున్నారు.

వెంటనే సినిమా చూసేయాలని ఉందంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ఇక సినిమాల్లో చిరంజీవికి.. వెంకీ ఓ ప‌ర్స‌న‌ల్ సెక్యూరిటీగా కనిపించనున్నాడని టాక్ నడుస్తుంది. అంతేకాదు.. వెంకటేష్ కర్ణాటక ప్రాంతానికి చెందిన వ్యక్తిగా మెర‌వ‌నున్నాడట. ఆయన కేవలం కన్నడలోనే మాట్లాడుతాడని.. తెలుగులో మాట్లాడడని.. ఇందులో భాగంగా వచ్చే ఫన్నీ సీన్స్ థియేటర్స్‌లో ఆడియన్స్‌తో నువ్వులు పోయిస్తాయని.. టాక్ నడుస్తుంది. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు కానీ.. మరోసారి బాక్సాఫీస్ వద్ద.. ఈ ఇద్దరు స్టార్ హీరోలను ఒకే స్క్రీన్ పై చూసే అవకాశం కలగడం.. అది కూడా ఒక కామెడీ ఎంటర్టైనర్ కావడంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక.. ఈ సినిమాతో అనిల్ ఎలాంటి సంచలనం సృష్టిస్తాడు.. చిరుకి ఎలాంటి బ్లాక్ బస్టర్ రిజల్ట్ ఇస్తాడో చూడాలి.