టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 ప్రస్తుతం సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. హౌస్‌లో ఎప్పుడు ఊహించని మలుపులతో.. ప్రేక్షకులలో హైప్ నెల్ఒంటుంది. తాజాగా ఇద్దరు కంటిస్టెంట్‌ల విషయంలో ఈ ఊహించని ట్విస్టులు ఎదురు కానున్నాయి. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయేషా.. ట్రీట్మెంట్ కోసం బిగ్ బాస్ హౌస్‌ను విడిచి వెళ్లనుందట. ప్రస్తుతం ఆమె.. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
ఆమె ఆరోగ్యం పూర్తిగా కుదుటపడి.. వైద్యుల అనుమతి వస్తే అప్పుడే ఆయేషా తిరిగి హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనుందట. లేదంటే ఈ వీక్ లోనే ఆయేషాను హౌస్ నుంచి పంపించనున్నారని సమాచారం. దీంతో ఆయేషా బిగ్ బాస్ జర్నీ ఎండ్ అయిపోయిందా.. లేదంటే ఆరోగ్యం పూర్తిగా కుదుటపడిన తర్వాత మళ్ళీ హౌస్ లోకి అడుగుపెడుతుందా అనే సందేహాలు ణ్యాన్స్‌లో మెదలయ్యాయి. ఇదిలా ఉంటే హౌస్‌లో జరిగిన మిడ్ వీక్ ఎలిమినేషన్స్ అందరికి షాక్ ను గురిచేశాయి.
![]()
మాజీ కంటెస్టెంట్స్ అర్జున్, అమర్ ధీప్‌లు హౌస్ లోకి వచ్చి.. రాము రాథోడ్ ఎలిమినేట్ అయ్యాడు అంటూ ప్రకటించారు. అతని బయటకు తీసుకెళ్లిపోయారు. ఇది ఊహించని కంటెస్టెంట్స్.. మిడ్ వీక్ ఎలిమినేషన్స్ చూసి హౌస్ మేట్స్ రాము రాథోడ్ మళ్ళీ నవ్వుతూ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేశాడు. దీంతో.. అది కేవలం హౌస్ మేట్స్ కు ఒక ట్విస్ట్ ఇచ్చేందుకు జరిగిన డ్రామా అని తెలిసింది. కంటెస్టెంట్స్ అంతా హ్యాపీ అయిపోయారు.

