ఇండస్ట్రీలో చిన్న హీరోల నుంచి స్టార్ హీరోల వరకు ఎవరైనా సరే.. ఓ సినిమా చేయాలంటే ఎన్నో విషయాలు ఆలోచిస్తారు. కథ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటారు. నటించబోయే సినిమా ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతుందా.. లేదా.. కచ్చితంగా ఆడియన్స్‌ను మెప్పించగలమా అని ఎన్నో ఆలోచనల తర్వాత.. ఒక కథను ఎంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే తమ వద్దకు ఎన్ని కథలు వచ్చినా వాటికి వాళ్లు సెట్ అవుతామనిపిస్తేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. అంతేకాదు.. కొన్ని సందర్భాల్లో హీరోలకు కథ నచ్చినా.. బిజీ షెడ్యూల్ కారణంగా.. లేదంటే రేంజ్‌కు తగ్గా సినిమా కాదని.. లేదా తన బాడీ లాంగ్వేజ్ కు సినిమా సెట్ అవుదనో ఇలా.. రకరకాల కారణాలతో ఆ సినిమాలను వదులుకుంటూ ఉంటారు.
అలా రెబల్ స్టార్ ప్రభాస్ కూడా తన కెరీర్ లో ఎన్నో సినిమాలను రిజెక్ట్ చేశాడు. వాటిలో నితిన్ నటించిన దిల్, ఎన్టీఆర్ నటించిన సింహాద్రి, అల్లు అర్జున్ – ఆర్య, రామ్ చరణ్ – నాయక్, మహేష్ బాబు – ఒక్కడు, రవితేజ – కిక్.. ఇలా చాలా కథలే ఉన్నాయి. ఈ స్టోరీస్ అన్ని మొదట ప్రభాస్ కి వచ్చాయట. షెడ్యూల్స్ కుదరకపోవడం.. ఇతర కారణాలతో ప్రభాస్ వాటిని రిజెక్ట్ చేశాడని టాక్. అయితే.. ప్రభాస్ రిజెక్ట్ చేసిన ఒక సినిమాతో మాత్రం.. ఎన్టీఆర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుని తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ మూవీ మరేదో కాదు.. బృందావనం.
ప్రభాస్, వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో తెరకెక్కిన మున్నాతో ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. వంశీ తన రెండో సినిమాను కూడా ప్రభాస్‌తోనే చేయాలని భావించాడట. అయితే.. అప్పటికే తన లైనప్ ఫుల్‌గా ఉండడంతో.. ప్రభాస్ ఈ సినిమా విషయంలో పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో.. కథను ఎన్టీఆర్‌కు వినిపించడం.. కథ విన్న వెంటనే తారక గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. అలా ఈ సినిమా సెట్స్‌పైకి వచ్చింది. ఈ సినిమా అప్పట్లో భారీ లెవెల్ లో ఆడియన్స్‌ను ఆకట్టుకుని బ్లాక్ బస్టర్ గా నిలిచింది.