మెగా ఫ్యాన్స్ కు బిగ్ గుడ్ న్యూస్.. మళ్లీ తండ్రి కాబోతున్న చరణ్.. సీమంతం వీడియో వైరల్..!

టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. ఉపాసన జంట పాన్ ఇండియా లెవెల్ లో మోస్ట్ పాపులర్ కపుల్ గా ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ జంట పెళ్లయిన దాదాపు 11 ఏళ్ల తర్వాత అంటే 2023 జూన్‌లో క్లింకారకు జన్మనిచ్చారు. ఈ క్రమంలోనే చరణ్ కు ఓ వారసుడు పూడితే బాగుంటుంది అంటూ ఫ్యాన్స్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే.. మెగా దంపతులు ఫ్యాన్స్ కు బిగ్ గుడ్ న్యూస్ చెప్పారు. అసలు మేటర్ ఏంటంటే.. మెగా పవర్ స్టార్ రాబ్ చరణ్ మరోసారి తండ్రి కాబోతున్నారట. ఇప్పటికే మెగాస్టార్ ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్ గ్రాండ్ లెవెల్ లో జరిగిన సంగతి తెలిసిందే.

ఈ సెలబ్రేషన్స్ తో పాటే ఉపాసన సీమంతం వేడుకలు కూడా కుటుంబ సభ్యుల మధ్య గ్రాండ్‌గా జరిగింది. ఈ వీడియోను ఉపాసన తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. డబ్బల్‌ ప్రేమ, డబ్బల్‌ బ్లెస్సింగ్స్, డబ్బల్ సెలబ్రేషన్స్ అంటూ క్యాప్షన్ జోడించింది. ఈ పోస్ట్ నెటింట‌ వైరల్‌గా మారడంతో మెగా ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సింబా వస్తున్నాడంటూ తెగ మురిసిపోతున్నారు. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చరణ్‌, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారంటూ వార్తలు తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఉపాసన షేర్ చేసిన ఒక్క వీడియోతో.. ఈ వార్త‌ల‌ని నిజమే అని తెలిసిపోయింది.

తాజాగా ఉపాస‌న‌ షేర్ చేసిన వీడియోలో కుటుంబ సభ్యులు, బంధువులందరికీ ఆశీస్సులు తీసుకుంటూ కనిపించింది. ఇక చ‌ర‌ణ్ మూవీస్ విష‌యానికి వ‌స్తే.. ప్రజంట్‌ పెద్ది సినిమా షూట్ లో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసింది. బుచ్చిబాబు డైరెక్షన్‌లో తెర‌కెక్కిన ఈ సినిమా చరణ్ బర్త్ డే సందర్భంగా వచ్చే ఏడాదిమార్చ్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేయ‌నున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమా నుంచి రిలీజ్ చేసే ప్రమోషనల్ కంటెంట్ తో ఆడియన్స్ లో ఏ రేంజ్ లో హైప్‌ను క్రియేట్ చేస్తారో.. ఈ సినిమాతో చరణ్ కు బుచ్చిబాబు ఎలాంటి సక్సెస్ ఇస్తాడో చూడాలి.