టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రతి ఒక్కరితోను ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారన్న సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పుడు ఒక్క బాలయ్యతో తప్ప అనే టాక్ వైరల్ గా మారుతుంది. గతంలో బాలయ్య, చిరు కూడా ఎంత సన్నిహితంగా ఉండేవాళ్ళు. ఇక మొదటి నుంచి వీళ్లిద్దరి మధ్యన బాక్స్ ఆఫీస్ వార్ కొనసాగుతున్నా.. వ్యక్తిగతంగా మాత్రం మంచి స్నేహాన్ని మెయింటైన్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇటీవల కాలంలో పర్సనల్ లైఫ్ లోను కోల్డ్ వార్ మొదలైందని.. తాజాగా జరిగిన సంఘటన తో అర్థమవుతుంది. అసెంబ్లీ సాక్షిగా బాలయ్య.. చిరంజీవిని విమర్శిస్తూ మాట్లాడడం, దానికి చిరంజీవి కౌంటర్లు వేయడం తెగ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. వీళ్ళిద్దరికీ సంబంధించిన పార్టీల పొత్తు ఉండడం.. ఇది అధికార పార్టీ కావడంతో.. వీళ్ళిద్దరి వారి మధ్యలో అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ నలిగిపోతున్న పరిస్థితి.
దీనిపై.. ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియని అయోమయంలో పడిపోయారు. ఇదంతా ఒక షేడ్ అయితే.. మరో పక్క రీసెంట్గా 80స్ రీ యూనియన్ ప్రోగ్రాం జరిగిన సంఘటన తెలిసిందే. ఇందులో బాలయ్య, నాగార్జున తప్ప మిగతా స్టార్ హీరోస్ అంతా సందడి చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇక రీసెంట్గా మెగాస్టార్ సైతం దీపావళి సెలబ్రేషన్స్‌కు మొత్తం ఇండస్ట్రీ అందరిని కుటుంబాలతో సహా ఆహ్వానించారు. ఈ క్రమంలోనే విక్టరీ వెంకటేష్ దంపతులు, అలాగే.. నాగార్జున దంపతులు చిరు ఫ్యామిలీతో కలిసి ఫోటోలు దిగారు. ఈ ఫొటోస్ చిరంజీవి స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్‌గా మారింది. కాగా నందమూరి బాలకృష్ణ కూడా ఈ సెలబ్రేషన్స్ లో భాగమై ఉంటే బాగుండేదని.. చిరు.. బాలయ్యను కూడా ఆహ్వానించి ఉంటే బాగుండేది అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే.. చిరు, బాలయ్య కి ఆహ్వానం అందించాడట. కానీ.. బాలయ్య ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొనలేదని.. ఓ టాక్ కూడా ఉంది. ఈ క్రమంలోనే బాలయ్యకు.. చిరు విషయంలో స్నేహభావం ఉండేదని.. చిరు మాత్రమే ఎప్పుడు బాలయ్యను స్నేహభావంతోనే చూస్తాడంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవిని ఇండస్ట్రీ పెద్దగా భావించడం.. ఆయన పై ఎప్పుడు ప్రశంసలు కురిపించడం బాలయ్యకు ఇష్టం ఉండదని కామెంట్లు వినిపిస్తున్నాయి. అందుకే చిరంజీవితో.. బాలయ్య ఎప్పటికప్పుడు గ్యాప్ ను మెయింటైన్ చేస్తూ వస్తున్నాడట. ఇప్పుడు ఆ గ్యాప్ మరింతగా పెరిగిందని సమాచారం. ఇక వీళ్లిద్దరి మధ్యన గ్యాప్ మాత్రమే కాదు.. ఈ దీపావళి సెలబ్రేషన్స్ కు బాలయ్య రాకపోవడానికి నాగార్జున కూడా ఒక కారణం అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాగార్జునతో కూడా గతంలో బాలయ్యకు గొడవలు జరిగిన సంగతి తెలిసిందే.