చరణ్ ఫ్యాన్ కు బిగ్ షాక్.. పెద్ది షూట్ క్యాన్సిల్ కారణం అదేనా..!

ఉప్పెనా ఫేమ్ బుచ్చిబాబు సనా మొదటి సినిమాతోనే టాలీవుడ్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తన రెండో సినిమా పెద్దితో పాన్ ఇండియా మార్కెట్ ను టార్గెట్ చేశాడు. ఎలాగైనా.. పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ కొట్టాలని కసితో బుచ్చిబాబు పనిచేస్తున్నాడు. ఇక.. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, టీజర్, మ్యూజిక్, గ్లింప్స్‌ ప్రతి ఒకటి ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఇక.. ఈ సినిమాల్లో భావోద్వేగ గాఢ‌త, అర్బన్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమాకు మరింత హైలెట్ గా మారనుందని టాక్. ఈ క్రమంలోనే.. సినిమాపై ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

Ram Charan wishes 'RC16' director Buchi Babu Sana on his 43rd birthday,  shares heartfelt message | Telugu Movie News - The Times of India

ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 27న చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. కాగా.. మార్చి 26న శ్రీరామనవమి ఉండడంతో అదే రోజున సినిమాను రిలీజ్ చేసే ఛాన్స్ ఉందట. ఇక.. ఇప్పటికే సినిమా షూట్ తుది ద‌శ‌కు చేరుకుంది. చరణ్ సినిమాలో పూర్తి వైవిద్యమైన పాత్రలో మెరవనున్నాడు. ఇలాంటి క్రమంలో షూట్‌కు బ్రేక్ పడింది అంటూ టాక్ నెటింట‌ వైరల్‌గా మారుతుంది. టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం డైరెక్టర్ బుచ్చిబాబు సనా.. ఈ సినిమా కోసం సరైన తిండి, నిద్ర కూడా లేకుండా తీవ్రంగా శ్రమిస్తూ, రాత్రింబవళ్లు కష్టపడడంతో స్వల్పంగా అనారోగ్యం పాలనట్లు తెలుస్తుంది. దీంతో.. డాక్టర్‌ను అప్రోచ్ కాగా.. సరైన తిండి ,నిద్ర లేకపోవడం వల్ల బలహీనంగా మారారని కొంతకాలం రెస్ట్ అవసరమని చెప్పినట్లు తెలుస్తుంది.

Ram Charan's Transformation For Peddi Breaks The Internet; Buchi Babu Sana  Says 'Can't Wait For This Changeover' - See Pic

ఈ విషయం తెలుసుకున్న చరణ్ వెంటనే షూటింగ్ను కొన్ని రోజులపాటు ఆపించేసి.. బుచ్చిబాబును రెస్ట్ తీసుకోమని సూచించాడట. పూర్తిగా కోల్కున్న తర్వాతనే మళ్లీ రీషూట్ ను ప్రారంభిద్దామని వివరించాడట. ఈ క్రమంలోనే సినిమా షూట్‌కు బ్రేక్ పడినట్లు తెలుస్తుంది. ఇక.. బుచ్చిబాబు ఇప్పుడు మెల్లమెల్లగా కోలుకుంటున్నా.. పూర్తిగా ఫిట్ కావడానికి మరి కొంత సమయం పడుతుందని టాక్. ఇక.. రామ్‌చ‌రణ్‌కు ఎలాగైనా బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇవ్వాలని బుచ్చిబాబు పడుతున్న కష్టం చూసి.. మెగా అభిమానులే కాదు.. పెద్ది టీం కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పై ఎంతో కసితో వర్క్ చేస్తున్న బుచ్చి బాబుని చూసి కచ్చితంగా ఈ సినిమాతో చరణ్ బ్లాక్ బ‌స్టర్ అందుకుంటాడని.. పెద్ది చరణ్ కెరీర్‌లోనే ఓ మైల్డ్‌ స్టోన్‌గా నిలవబోతుందంటూ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.