బాహుబలి రీ రిలీజ్ భారీ బిజినెస్.. పాన్ ఇండియా లెవెల్ లో క్రేజీ రికార్డ్..!

ప్రభాస్ హీరోగా.. రాజమౌళి డైరెక్షన్‌లో తర్కెక్కిన బాహుబలి.. ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేసిందో.. తెలుగు సినిమా ఖ్మాతిపి ఎంత‌లా పెంచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మాటలో చెప్పాలంటే ఇది మూవీ కాదు ఒక బ్రాండ్. అలాంటి బాహుబలి మరోసారి రిలీజ్‌కు సిద్ధమవుతుంది. అయితే ఈ సినిమాలో ఒక రీ రిలీజ్ సినిమాగా కాకుండా.. సరికొత్త సినిమాగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ విషయంలోనూ ట్రేడ్ వర్గాల్లో భారీ చర్చలు మొదలయ్యాయి. సాధారణంగా.. రీ రిలీజ్ సినిమాలంటే ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ కోసం మంచి ప్రింట్ తో జ్ఞాపకాలను నెమరు వేసుకోవడానికి రిలీజ్ చేస్తారు. వాటికి పెద్దగా కలెక్షన్స్ అయితే రావు. ఏదో డీసెంట్ కలెక్షన్లతో సినిమా థియేటర్లలో రన్ అవుతుంది. కానీ.. ఇప్పుడు రీ రిలీజ్‌కు సిద్ధమవుతున్న బాహుబలి ది ఎపిక్ విషయంలో మాత్రం ఈ రూల్ బ్రేక్ చేసేటట్లు కనిపిస్తుంది.

Baahubali Re-release: Prabhas-SS Rajamouli's EPIC Pan-India Film To Hit Screens Once Again; New Records Await - Filmibeat

కొత్త సినిమా బిజినెస్లతో.. బాహుబలి ఎపిక్ పోటి ప‌డుతుంద‌ట‌. ఈ సినిమాపై ఉన్న క్రైజ్‌తో డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ సినిమా కోసం భారీ మొత్తాన్ని వెచ్చించేందుకు సిద్ధమయ్యారట. ఈ క్రమంలోనే.. రీ రిలీజ్‌లో హైయెస్ట్ కలెక్షన్లు కొల్ల‌గొట్టిన క్రేజీ రికార్డును బాహుబలి సొంతం చేసుకుంటుందంటూ.. రీ రిలీజ్ బిజినెస్ లిస్ట్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. ఆ లిస్ట్ ప్రకారం ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమాకు థియేట్రి్ల్ బిజినెస్ రూ.36.5 కోట్ల వరకు జరిగిందట. నైజాంలో రూ.17 కోట్లు, సీడెడ్‌లో రూ.4.5 కోట్లు, ఆంధ్రాలో రూ.15 కోట్లకు బాహుబలి హక్కులు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే.. రీ రిలీజ్ సినిమాకు ఈ రేంజ్ లో బిజినెస్ జరగడం అంటే సాధారణ విషయం కాదు.

SS Rajamouli announces Baahubali - The Epic release date

ప్రస్తుతం ఓ టైర్ 2 హీరో కొత్త సినిమా రేంజ్‌లో ఇది బిజినెస్ జరుపుకుంటుందట. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు గాని.. నిజంగానే ఈ రేంజ్‌లో సినిమాకు కలెక్షన్లు వస్తే మాత్రం సరికొత్త రికార్డు క్రియేట్ అవుతుంది అంటూ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే.. సినిమా భారీ బిజినెస్ జరుపుకోవడానికి వెనుక కొన్ని లాజిక్స్ కూడా వినిపిస్తున్నాయి. మ్యాటర్ ఏంటంటే.. ఈ సినిమా రెండు భాగాలను కలిపి ఒక సినిమాగా తీయడమే కాదు.. కొన్ని కొత్త సీన్స్ కూడా జోడించి మరింత ఆసక్తిగా ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నారట. ఇది సినిమాకు అతిపెద్ద హైలెట్గా మారనుంది. ఇక ఇప్పటివరకు వినిపిస్తున్న బిజినెస్ లిస్ట్ వాస్తవం ఎంతో తెలియదు కానీ.. ఓ రీ రిలీజ్ సినిమాకు బిజినెస్ చర్చలు ఈ రేంజ్ లో జరుగుతున్నాయంటే బాహుబలి బ్రాండ్ ఏంటో దీన్ని బట్టి అర్థమవుతుందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు వాస్తవం ఎంతో తెలియాలంటే.. మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.