ట్రాక్ తప్పుతున్న అనిల్ రావిపూడి.. ఈసారి కష్టమేనా..!

టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇండస్ట్రీలో తిరుగులేని సక్సెస్ రేట్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి తర్వాత ఈ రేంజ్‌లో సక్సెస్‌లు అందుకుంటున్న డైరెక్టర్గా అనిల్ రావిపూడి స్థానాన్ని దక్కించుకున్నాడు. పదేళ్ల క్రితం పటాస్‌తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ఇప్పటివరకు ఫెయిల్యూర్ ఎరుగని దర్శకుడుగా దూసుకుపోతున్నాడు. తనదైన స్టైల్‌లో కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ ఎంట్ర‌టైన్మెంట్‌ను మిక్స్ చేస్తూ ఆడియన్స్‌ను తన సినిమాలకు కనెక్ట్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అనీల్ తెరకెక్కించిన ప్రతి సినిమాను సినీప్రియలు విపరీతంగా అలరిస్తున్నారు. కళ్యాణ్ రామ్.. పటాస్ సినిమాతో తనకి ప్రారంభించిన అనిల్ తర్వాత వెంకటేష్‌.. వరుణ్ తేజ్‌ల‌తో ఎఫ్2, ఎఫ్ 3 సిరీస్‌లను రూపొందించి సక్సెస్ అందుకున్నాడు.

Anaganaga Oka Raju (2026) - Movie | Reviews, Cast & Release Date in Ziro- BookMyShow

ఇక.. మహేష్‌తో సరిలేరు నీకెవ్వరు, బాలయ్య.. భగవంత్‌ కేసరి ఇలా.. వరుస సినిమాలతో మంచి సక్సెస్‌లు అందుకున్నాడు. ఇక చివరిగా.. వెంకటేష్ హీరోగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఆడియన్స్‌ను పలకరించాడు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే బ్లాక్ బస్టర్‌ అందుకుంది. ఇక్కడ మరో హైలెట్ ఏంటంటే.. ఈ ఏడాది సంక్రాంతి బరిలో వెంకటేష్ సినిమాతో పాటు.. ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు రంగంలోకి దిగాయి. ఆ రెండు సినిమాలను వెనక్కు తోసి మరి.. అనిల్ రావిపూడి సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. పర్ఫెక్ట్ సంక్రాంతి డైరెక్టర్గా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక.. వచ్చే ఏడాది కూడా సంక్రాంతి బరిలోనే తన సినిమాను రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యాడు.

The Raja Saab (2026) - Movie | Reviews, Cast & Release Date in Hyderabad- BookMyShow

అదే మన శంకర వరప్రసాద్ గారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, నయనతార హీరోయిన్గా మెరిసిన ఈ సినిమా సంక్రాంతి బరిలో రిలీజ్ కు సిద్ధమవుతుంది. ఇప్పటికే సినిమాపై ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా తెర‌కెక్కనుంది. అయితే.. అభిమానులు మాత్రం ఈ సినిమాతో హిట్ కొట్టడం ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నా .. మరి కొంతమంది మాత్రం అనిల్ ట్రాక్ తప్పినట్లు అనిపిస్తుందని.. ఈసారి సక్సెస్ అంత ఈజీ కాదు.. కంటెంట్ బాగుండాలి, ఆడియన్స్‌ను మెప్పించాలి..అప్పుడే సక్సెస్ సాధ్యమవుతుంది. లేదంటే.. రిజల్ట్ ఎలా ఉంటుందో చెప్పలేమంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కారణం.. సంక్రాంతికి గత రెండుసార్లు వచ్చిన అనిల్.. ఫ్యామిలీ ఎంటర్టైనర్లు ఎఫ్2, సంక్రాంతికి వస్తున్నాంతో సక్సెస్‌లు అందుకున్నాయి.

Anil Ravipudi, Chiranjeevi's film Mana Shankara Vara Prasad Garu's release date | Regional-cinema News – India TV

ఈసారి కూడా.. మళ్లీ అదే జోనర్‌లో చిరంజీవిని పెట్టి సినిమా తీస్తున్నారు. ఈసారి మాత్రం ప్లాన్ బెడిసికొట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. 2019లో ఎఫ్ 2 తప్ప ఆ టైంలో మరే ఫ్యామిలి ఎంటర్టైనర్ రిలీజ్ కాలేదు. తర్వాత.. ఏడాదిలో డాకు మహారాజ్‌, గేమ్ ఛేంజ‌ర్ సినిమాలు వచ్చిన అవి యాక్షన్ సినిమాలు కావడంతో.. సంక్రాంతి వస్తున్నాం కు అది ప్లస్ అయింది. కానీ.. 2019 నుంచి 2025 లా కాదు.. 2026 సంక్రాంతి రిలీజ్ సినిమాలన్నీ నెక్ష్ లెవెల్ లో ఉండేలా ఉన్నాయి. అనగనగా ఒక రోజు, రాజాసాబ్‌ సినిమాలు కూడా కామెడీ ఎంటర్టైనర్‌లే. ఈ క్రమంలోనే.. నవీన్ పోలిశెట్టి తన సినిమా ప్రమోషన్స్‌లో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాడు. అటు రాజాసాబ్‌కు కూడా.. ఆడియన్స్‌లో మంచి హైప్‌ మొదలైంది. దీంతో మన శంకర వరప్రసాద్ గారు మూవీకి రెండు సినిమాల నుంచి మంచి పోటీనే ఎదురుకానుంది. మరి.. అనిల్ సినిమాను ఎలా తీసుకొస్తారు.. ఎంతలా ఆకట్టుకుంటాడో.. ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుంటాడో చూడాలి.