టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఎస్ఎస్ఎంబి 29 రన్నింగ్ టైటిల్‌తో రూపొందుతున్నాయి. ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్లో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ని కూడా రివీల్ చేయకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న జక్కన్న.. ఈ సినిమా కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్‌లో మంచి ఆసక్తి మొదలైంది.
త్రిబుల్ ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి నటిస్తున్న ఈ సినిమాతో మహేష్ కెరీర్లోనే నెవర్ బిఫోర్ బ్లాక్ బస్టర్ ఖాయమంటూ ఆయన కెరియర్ మైల్డ్స్టోన్గా ఈ సినిమా నిలవబోతుందంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. బిగ్గెస్ట్ బడ్జెట్‌తో రూపొందిన ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా చాలంటూ ఫ్యాన్స్ ఎప్పటినుంచో కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు వాళ్ళ నిరీక్షణకు చెక్ పెడుతూ ఓ బ్లాస్టింగ్ అప్డేట్ మేకర్స్ రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారట.
అది కూడా నవంబర్‌లో ఓ డేట్ ను లాక్ చేసినట్లు తెలుస్తుంది. అంతేకాదు.. డేట్‌ను కూడా ఫిక్స్ చేశారని న్యూస్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. ఇంతకీ.. అసలు ముహూర్తం ఎప్పుడంటే నవంబర్ 16న ఈ గ్రాండ్ ట్రీట్ ను ఆడియన్స్ పండగ చేసుకునే రేంజ్ లో మేకర్స్ రిలీజ్ చేయనున్నారట. ఈ క్రమంలోనే కేవలం పాన్ ఇండియా లెవెల్లోనే కాదు.. పాన్ వరల్డ్ రేంజ్లో టాలీవుడ్ రేంజ్ అర్థమవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. మేకర్స్ దీనిపై అఫీషియల్ ప్రకటన ఇవ్వాల్సి ఉంది.