టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సక్సెస్‌తో ప్రస్తుతం ఫుల్ జోష్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. ఆయన నెక్స్ట్ సినిమాల లైన్, దర్శకుల లిస్ట్ ఆడియన్స్‌లో మరింత ఆసక్తి నెలకొంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఒకరు కాదు, ఇద్దరు తమిళ్ క్రేజీ డైరెక్టర్‌లకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇక ప్రజెంట్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకుడుగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూట్‌లో పవన్ బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆయన చేయబోయే సినిమాలకు సంబంధించిన అప్డేట్ ప్రస్తుతం తెగ వైరల్‌గా మారుతున్నాయి. పవన్ ఇప్పటికే కన్నడ ప్రొడక్షన్ హౌస్ కెవిఎన్ సంస్థకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
ఈ సంస్థ నిర్మాత ఎన్‌కే.లోహిత్ – పవన్‌ను ఇప్పటికే కలిశారు. ఈ క్రమంలోనే.. సినిమాను ఫిక్స్ కూడా చేసేసుకున్నారట. అయితే.. పవన్ రేంజ్‌కు తగ్గ డైరెక్టర్, కథ కోసం ప్రస్తుతం కెవిన్ ప్రొడక్షన్ వాళ్ళు సెర్చింగ్ మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే.. ఒకరు కాదు, ఇద్దరు క్రేజీ తమిళ్ డైరెక్టర్‌లను ఎంచుకున్నారట టీం. ఆ ఇద్దరిలో.. ఒకరు లోకేష్ కనకరాజ్, మరొకరు హెచ్. వినీత్. వీళ్ళిద్దరూ ఇప్పటికే దర్శకులుగా తమని తాము ప్రూవ్ చేసుకున్నారు. హెచ్. వినీత్ కేవలం రీజనల్ సినిమాలతో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటే లోకేష్ కనకరాజు మాత్రం పాన్ ఇండియా లెవెల్లో ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నాడు.
ఖైదీ, విక్రమ్, కూలి లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్నాడు. ఇక.. హెచ్.వినీత్ అయితే థ్రిల్లర్, స్టైలిష్, యాక్షన్ సినిమాలకు క్యారఫ్ అడ్రస్‌గా నిలిచాడు. అజిత్‌తో వలిమై, తెగింపు సినిమాలను రూపొందించి మంచి సక్సెస్ అందుకున్న వినీత్.. ప్రజెంట్ దళపతి విజయ్‌తో జననాయగన్ సినిమాలు రూపొందిస్తున్నాడు. ఈ క్రమంలోనే.. వీళ్ళిద్దరిలో ఒకరితో పవన్ సినిమా చేయబోతున్నాడని టాక్ వైరల్ గా మారుతుంది. కాగా.. ప్రజెంట్ పవన్ కు ఉన్న హైప్, రేంజ్ రిత్యా.. లోకేష్ తో సినిమా చేస్తే పర్ఫెక్ట్ గా ఉంటుందని.. కచ్చితంగా ఇద్దరు కాంబినేషన్లో ఓ సినిమా వస్తే ఓజీని మించి పోయే రేంజ్ లో బ్లాక్ బస్టర్ కొట్టి.. బాక్సాఫీస్ రికార్డులు క్రియేట్ చేయడం కాయమంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి పవన్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ కు దర్శకుడుగా ఎవరు వ్యవహరిస్తారో చూడాలి.