కీర్తి సురేష్ ఎమోషనల్ లవ్ స్టోరీ.. 15 ఏళ్ల పోరాటం..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ మహానటిగా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ అమ్మడు.. డిసెంబర్ 2024 లో తన చిన్ననాటి స్నేహితులు, బిజినెస్ మ్యాన్ అయిన ఆంటోనీ తట్టిల్‌ను ఇరు కుటుంబాల సమక్షంలో గ్రాండ్గా వివాహం చేసుకుంది. ఈ క్రమంలోనే తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. జగపతిబాబు హోస్ట్‌గా చేస్తున్న టాక్ షో జయమ్ము నిశ్చయమ్మురా.. లో సందడి చేసిన ఈ కేరళ కుట్టి.. తన పర్సనల్ లైఫ్, లవ్ స్టోరీ, వివాహం.. ఈ జర్నీలో ఎదుర్కొన్న మానసిక సంఘర్షణల గురించి ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. కీర్తి సురేష్.. హిందూ కుటుంబానికి చెందిన అమ్మాయి. ఇక ఆమె భర్త.. ఆంటోనీ తట్టిల్ క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తి. అందుకే.. మతపరమైన తేడాల కారణంగా ఇంట్లో సమస్యలు వస్తాయని.. కచ్చితంగా ఇంట్లో వాళ్ళు పెళ్లికి ఒప్పుకోరు అని అనుకున్నారట.

Watch Jayammu NischayammuRaa with Jagapathi TV Serial 10th October 2025  Full Episode 10 Online on ZEE5

ఇదే విషయాన్ని కీర్తి వివ‌రిస్తూ.. మా ప్రేమ వల్ల ఇంట్లో చాలా సమస్యలు వస్తాయని భావించాం. నాలుగేళ్ల క్రితం.. ఒక రోజు నేను నాన్నతో మాట్లాడా. కానీ.. నాన్న దాన్ని చాలా సులభంగా ఒప్పేసుకున్నాడు. నేను ఊహించినంత కష్టంగా ఏమి జరగలేదంటూ కీర్తి వివరించింది. ఆమె తండ్రి సురేష్ కుమార్.. తల్లి మేనక ఇద్దరు సినీ ఇండస్ట్రీకి చెందినవారు కావడంతో.. వాళ్ల కూతురు నిర్ణయాన్ని గౌరవించి ఆమె ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక.. ఆంటోనీతో తన లవ్ జర్నీ గురించి కీర్తి మాట్లాడుతూ.. మేమిద్దరం పెళ్లి పీటలు ఎక్కడానికి 15 ఏళ్లు పట్టిందని.. మాకు కొంచెం టైం కావాలి.. కాలేజీ డేస్ లోనే 2010లో డేటింగ్ స్టార్ట్ చేసాం.. నేనప్పుడు కాలేజ్ స్టడీస్ కంప్లీట్ చేసి కెరీర్‌లో స్థిరపడాలి. ఇక.. ఈ 15 ఏళ్లలో ఆటోని కథ‌ర్‌లో ఉండడం.. నేను చెన్నైలో ఉండడం వల్ల సుమారు 6 ఏళ్లు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ షిప్ లోనే ఉండాల్సి వచ్చింది అంటూ వివరించింది. ఆ తర్వాత ఆయన ఇండియాకి వచ్చేసారు. మా ఇద్దరికీ కొంత టైం అవసరమైంది అంటూ చెప్పుకొచ్చింది.

Watch Jayammu NischayammuRaa with Jagapathi Latest Episodes Online  Exclusively on ZEE5

స్కూల్ డేస్ నుంచి మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. అదే మా ఇద్దరి మధ్యన ప్రేమగా మారింది అంటూ కీర్తి చెప్పుకొచ్చింది. ఇక మహానటి సినిమా సక్సెస్ టైం లో ఆంటోనీ దాన్ని చాలా బాగా సెలబ్రేట్ చేశారు. ఓ కుక్క పిల్లను నాకు గిఫ్ట్ గా ఇచ్చాడంటూ చెప్పుకొచ్చింది. అప్పట్లో.. మా బంధం గురించి బహిరంగంగా చెప్పలేకపోయినా.. ఆ ప్రేమను గౌరవించుకుంటూ ఆ కుక్కపిల్లకు మా ఇద్దరి పేర్లు కలయికగా.. నైక్‌ అని పేరు పెట్టామంటూ వివరించింది. Antony లోని ny. keerthy లోని ke అక్షరాలను కలిపి nykeపెట్టామని చెప్పుకొచ్చింది. ఇక తర్వత‌ పెద్దల‌ను వాళ్ళ ప్రేమకు ఒప్పించడం.. 2024 డిసెంబర్ 12న గోవాలో వెళ్ళిద్దరూ గ్రాండ్గా వివాహం చేసుకోవడం తెలిసిందే. ఇద్దరు తమ సాంప్రదాయాలను గౌరవిస్తూ హిందూ, క్రైస్తవ పద్ధతుల్లో రెండుసార్లు వివాహం చేసుకున్నారు. ఇక పెళ్లి తర్వాత కూడా.. కీర్తి తన ప్రొఫెషనల్ లైఫ్‌ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే.. పలు సినిమాల్లో నటించిన ఈ అమ్మడు.. తెలుగులో నెక్స్ట్ విజయ్ దేవరకొండ సరసన రౌడీ జనార్ధన్ లోమెర‌వ‌నుంది. రవి కిరణ్ కొల్లా డైరెక్షన్‌లో తెర‌కెక్క‌నున్నాయి. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఇటీవ‌ల గ్రాండ్గా జరిగాయి. ఇక ఈ సినిమాతో పాటు.. బాలీవుడ్ లో బేబీ జాన్, తమిళ్‌లో రివాల్వర్ రీటా, కన్నె వీడి లాంటి ప్రాజెక్టులలో బిజీగా గడుపుతుంది కీర్తి. మరోవైపు మ్యారీడ్ లైఫ్‌ను కూడా ఎంజాయ్ చేస్తూ.. సినిమాలను బ్యాలెన్స్ చేస్తుంది.