బిగ్ బాస్.. వాడికి అమ్మాయిల పిచ్చి.. అలా నాపై చేయి వేస్తే తొక్కేస్తా కళ్యాణ్ పై రమ్య మోక్ష..!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఇటీవల ప్రారంభమై సక్సెస్ ఫుల్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. షోలో మరింత హీట్ పెంచేందుకు బుధవారం ఆరుగురిని వైల్డ్ కార్డ్‌ ద్వారా లోపలకు పంపాడు బిగ్‌బాస్. దీంతో షో రూపురేఖలు మారిపోతాయని బిగ్ బాస్ టీం గట్టిగా నమ్మకాలు పెట్టుకున్నారు. అయితే.. వాళ్ళు అంచనాలను నిజం చేస్తూ వైల్డ్ కార్డ్‌ కంటెస్టెంట్‌లు హౌస్‌లో రచ్చ బాగానే చేస్తున్నారు. ముఖ్యంగా.. దివ్వెల మాధురి హౌస్‌లోకి అడుగు పెట్టినప్పటి నుంచి.. చెలరేగిపోయి కాంట్రవర్సీలకు క్యారాఫ్ అడ్ర‌స్‌గా మారిపోయింది. హౌస్‌లోకి అడుగుపెట్టిన మొదటి రోజే కెప్టెన్ కళ్యాణ్‌తో ఏమీలేని కారణానికి పెద్ద గొడవ పెట్టుకుని రచ్చ రచ్చ చేసింది. అయితే.. కళ్యాణ్ ఈ గొడవ మధ్యలో మాధురి మాట తీరు నచ్చక మీరు ఇలా మాట్లాడితే నేను వేరేలా మాట్లాడాల్సి వస్తుంది అంటూ ఓ కామెంట్ చేశాడు.

Bigg Boss Telugu 9: Kitchen clash, nominations and tensions shake up the  house - India Today

ఇక.. ఈ కామెంట్‌తో మాధురి మరింత రెచ్చిపోయి దానిని పెద్ద వివాదంలా మార్చేసింది. ఈ గొడవ ఆపడానికి హౌస్ మేట్స్ అందరూ ఎంత కష్టపడాల్సి వచ్చింది. వివాదం జరుగుతున్నంత సేపు నోటికి వచ్చినట్లుగా కళ్యాణ్‌ను తిట్టి పడేసిన మాధురి.. అంతా అయిపోయిన తర్వాత.. చివరకు కన్నీళ్లు పెట్టుకుంటూ వచ్చి కళ్యాణ్ కు సారీ చెప్పి వెళ్ళిపోయింది. ఇక మాధురి డైరెక్ట్ గా ఇచ్చి పడేస్తే.. అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్ రమ్య మోక్ష.. కళ్యాణ్ వెనకాల షాకింగ్ కామెంట్స్ చేసింది. మాధురిని పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడుతూ చెలరేగిపోయింది. ఆ కళ్యాణ అమ్మాయిల పిచ్చోడంటూ షాకింగ్ స్టేట్మెంట్ ఇవ్వడమే కాదు.. శ్రీజ బెలూన్ కట్ చేసినప్పటి నుంచి ఈ అబ్బాయి కళ్యాణ్ బిహేవియర్ చాలా మారిపోయింది.. అసలు మాట్లాడట్లేదు. ఐ కాంటాక్ట్ ఇవ్వట్లేదు.. మొహం కూడా తిప్పేసుకుంటున్నాడు.. మాట్లాడకపోతే ఎవరికంట అంటూ కామెంట్స్ చేసింది. మనం గేమ్ ఆడటానికి వచ్చాం.. ఎవరితోనూ మాట్లాడడానికి కాదని మాధురి – రమ్యకు సపోర్ట్ గా కామెంట్ చేసింది. ఆ అబ్బాయి తో మాట్లాడడానికి వచ్చామా ఏంటి అయినా.. అతను అమ్మాయిల పిచ్చోడు ఫస్ట్.. అంటూ రమ్య మండిపడింది. నేను అదే అన్నాను ప్రొఫెషన్ ఏంటో కూడా మర్చిపోయి అంటూ.. మాధురి కామెంట్ చేసింది.

Bigg Boss 9 Telugu: Eliminations to happen with a starry twist, here's what  we know

ఆ తర్వాత కళ్యాణ్.. తనుజాతో బిహేవ్ చేస్తున్న తీరుపై మోక్ష గట్టిగా రియాక్ట్ అయింది. ఫస్ట్ రోజు వచ్చి కూర్చుంటే తనుజపై చేతులు వేసేసి ఎంత ఇరిటేటింగ్ గా అనిపించిందో తెలుసా.. చూస్తే నాకే ఏదోలా ఉంది. అదే నన్ను చేస్తే లాగిపెట్టి ఒక్కటి ఇస్తా.. కిందేసి తొక్కేస్తే అంతే.. అలాగే ఉండాలి. ఈ అమ్మాయి ఎందుకు అలా లీనేస్ ఇస్తుందో కానీ.. డైరెక్ట్ గా చూపించట్లేదు. ఇన్ డైరెక్ట్ గా కావాలనే ఇస్తున్నట్లు అనిపించింది. ఆ బిహేవియర్ ను ఒక్క మాటతో ఆపేయొచ్చు. గట్టిగా ఒక మాట తిడితే చాలు అది ఆగిపోతుంది. హే.. హే.. అంటుంది అంతే. ఒకరు అలా చేశారంటే మనం కూడా ఏదో ఇచ్చే ఉంటాం కదా.. అంటూ కామెంట్ చేసింది. అందుకే కదా ఆ బిహేవియర్ వస్తుంది.. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అంటూ రమ్య.. తనుజ, కళ్యాణ్ ల గురించి షాకింగ్ కామెంట్లు చేసింది. అవును అంతేగా అంటూ మాధురి తనకు సపోర్ట్ గా మాట్లాడింది. ఈ క్రమంలోనే వీళ్ళిద్దరి కామెంట్స్ చాలా పర్సనల్ గా వెళ్ల‌డంతో ఈ వీకెండ్‌లో నాగార్జున దీనికి రియాక్ట్ అవుతారా.. లేదా.. వేచి చూడాలి.