అతనో ఉమెనైజర్.. సిద్దు జొన్నలగడ్డపై జర్నలిస్ట్ షాకింగ్ కామెంట్స్..!

సిద్ధ జొన్నలగడ్డ హీరోగా.. రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్‌లుగా మెరిసిన తెలుసు కదా మూవీ ట్రైలర్ గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక.. ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో మేకర్స్‌ సైతం మాట్లాడి.. సినిమాకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు. ఇందులో భాగంగానే సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో జర్నలిస్ట్ సిద్దు జొన్నలగడ్డను ఉద్దేశిస్తూ అడిగిన ప్రశ్న పెద్ద దుమారంగా మారింది. జర్నలిస్ట్ మాట్లాడుతూ.. సినిమాలో మీరు.. ఇద్దరు హీరోలతో ఉంటారు కదా. మీరు నిజజీవితంలో ఏమైనా ఉమెనైజ‌రీ.. అంటూ ప్రశ్నించారు. దీంతో.. అక్కడ ఉన్నవాళ్లంతా షాక్ అయిపోయారు. అయితే.. ఈ ప్రశ్న చాలా వివాదాస్పదంగా మారింది. కారణం.. ఉమెనైజర్ అంటే చిన్న పదం ఏమి కాదు.

Star Boy Siddu Jonnalagadda's Telusu Kada Romantic Birthday Poster Unveiled

చాలామంది అమ్మాయిలతో తక్కువ టైంలో తిరుగుతూ.. లవ్, బ్రేకప్ అంటూ వేరే వేరే అమ్మాయిలను మారుస్తూ ఉండే వాళ్ళని ఉమెనైజర్స్ అంటారు. కానీ.. ఈ సినిమా ట్రైలర్‌లో అలాంటి పదానికి సెట్ అయ్యే కాన్సెప్ట్‌ను కూడా.. కనీసం చూపించలేదు సరికదా.. ఇద్దరు హీరోయిన్లతో ఒక మంచి బాండింగ్ ఉన్నట్లుగానే సిద్దు కనిపించారు. అసలు ట్రైలర్ చూసిన అలాంటి ఒపీనియన్ రాదు. అలాంటిది జర్నలిస్ట్ ఏమనుకొని ఇలాంటి ప్రశ్న అడిగారు కూడా తెలియట్లేదు. ఈ క్రమంలోనే.. సిద్దు జొన్నలగడ్డ ఆశ్చర్యపోయారు. దెబ్బకు మైండ్ బ్లాక్ అయినట్లు ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ.. ఆ జర్నలిస్ట్ పై ఫైరయ్యారు. ఇదేమైనా పర్సనల్ ఇంటర్వ్యూ అనుకుంటున్నారా.. లేదా ప్రెస్‌మీట్ అనుకుంటున్నారా అంటూ మండిపడ్డారు.

దెబ్బతో జర్నలిస్ట్ సైలెంట్‌ అయిపోయారు. అయితే.. ఇటీవల కాలంలో ప్రెస్మీట్‌లో ఎలాంటి ప్రశ్నలు చాలా సహజమైపోయాయి. హీరో, హీరోయిన్లను ఇబ్బంది పెట్టేలా.. తమకు నచ్చినట్లుగా సినిమాతో సంబంధంలేని ప్రశ్నలను అడుగుతున్నారు. దీంతో.. చాలామంది హీరోలు, హీరోయిన్లు సమాధానం చెప్పడానికి ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు. తాజాగా.. ఈ సినిమా ఈవెంట్‌లో హీరో ప్రదీప్ రంగనాథన్ సైతం ఇలాంటి ఒక పరిస్థితి ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఓ జర్నలిస్ట్.. ప్రదీప్‌తో మాట్లాడుతూ.. మీ కటౌట్, ఫేస్ చూస్తే అసలు హీరో మెటీరియల్ లానే లేరు. కానీ.. రెండు సినిమాలతో హిట్ కొట్టారు. అది మీ అదృష్టం అనుకుంటున్నారా.. లేదా సినిమా కోసం మీరు పడ్డ హార్డ్ వర్క్ అనుకోవాలా అంటూ షాకింగ్‌ క్వశ్చన్ వేశారు. ఈ ప్రశ్నకు.. ప్రదీప్‌ చాలా ఫీల్ అయ్యాడు. అలా జర్నలిస్ట్ ఏమీ ఆలోచించకుండా మొహం పై అడగడం ఆడియన్స్ లోను ఆగ్రహానికి కారణమైంది.