కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌కు టాలీవుడ్ ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్.. పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోలీవుడ్ సినిమాలను సైతం తెలుగులో డబ్ చేసి.. మంచి సక్సెస్ అందుకుంటున్న ధనుష్.. ఇటీవల ఇడ్లీ కొట్టు సినిమాతో ఆడియన్స్‌ను పలకరించాడు. ఈ సినిమాకు తానే స్వయంగా దర్శకత్వం వహించడం విశేషం. అక్టోబర్ 1న రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ ను దక్కించుకున్నా.. కాంతార క్రేజ్ దెబ్బకు వెనకపడిపోయింది.
అయితే.. ప్రజెంట్ ధనుష్ భారీ సినిమాల లైనప్‌తో బిసి బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే టాలీవుడ్ క్రేజ్ ఉపయోగించుకొని.. తెలుగు నిర్మాతలను దోచుకుంటున్నాడట. మేటర్ ఏంటంటే.. తెలుగులో సార్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి హిట్ అందుకున్న ధనుష్ ఇప్పటికి అదే క్రేజ్‌తో తెలుగులో రాణిస్తున్నాడు. దీంతో ఓ తెలుగు నిర్మాత.. తెలుగు డైరెక్టర్ తో కలిసి సినిమా చేయమని ధనుష్‌ను అప్రోచ్ కాగా.. కథ నచ్చింది కానీ రూ.50 కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తే కానీ సినిమాలో నటించనని చెప్పేశాడట.
సినిమా హిట్ అయితే స్టార్ హీరోలు రెమ్యూనరేషన్ పెంచడం కామన్. కానీ.. తమిళ్లో ధనుష్ ఒక్క సినిమాకు కేవలం రూ.30 నుంచి రూ.35 కోట్లు అందుకుంటున్నాడు. ఇక తెలుగు అనే పాటకి కనీసం ఒక ఐదు కోట్లు పెంచి..రూ. 40 కోట్లయినా అడుగుతారు. ఏకంగా రూ.50 కోట్లు డిమాండ్ చేయడమేంటి అంటూ పలువురు మండిపడుతున్నారు. తెలుగు నిర్మాతలను నిలువునా దోచేయడానికి.. ధనుష్ ఫిక్స్ అయ్యాడని.. తెలుగువారిపై ప్రేమ నటిస్తూ ఇక్కడ ఉన్న క్రేజ్‌ను మనీ చేసుకోవాలని చూస్తున్నాడని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ధనుష్ పై విమర్శలు కురుస్తున్నాయి.