పవన్ టైటిల్ మరోసారి వాడేస్తున్న నితిన్.. ఈసారి ఏది అంటే..?

సినీ ఇండస్ట్రీలో హీరోలుగా అడుగుపెట్టి.. తమని తాము స్టార్ హీరోలుగా ఎలివేట్ చేసుకోవాలని.. ఆ స్టార్‌డంను లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలని ఎంతో మంది నటీనటులు.. స్టార్ హీరోలు సైతం ఆరాటపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే తమ సినిమాల కోసం ఎంతగానో కష్టపడతారు. సినిమాలతో సక్సెస్ అందుకోవాలని ఆరటపడతారు. కాని.. కొన్ని సందర్భాల్లో వారు ఊహించిన దానికి భిన్నమైన రిజల్ట్ అందుకోవాల్సి ఉంటుంది. అలా ఇప్పటికే ఎంతమంది హీరోలు వరుస ఫ్లాప్‌ల‌తో ఇండస్ట్రీ నుంచి ఫేడౌట్ అయ్యిన సందర్భాలు ఉన్నాయి. ప్రజెంట్‌ నితిన్ పరిస్థితి కూడా అదే.

Nithiin turns emotional as Pawan Kalyan secures victory | Telugu Cinema

జయం సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి.. మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకున్న నితిన్.. తర్వాత కాలంలో హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి.. సక్సెస్‌లు అందుకున్నాడు. మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. కాగా నితిన్ కు గ‌త కొన్నేళ్లుగా ఒక్క సరైన హిట్ కూడా లేదు. వరుస ఫ్లాప్స్‌ ఎదురవుతూనే ఉన్నాయి. రీసెంట్గా వచ్చిన.. తమ్ముడు సినిమాతో సైతం భారీ ఫ్లాప్ ను మూట కట్టుకున్న.. నితిన్ ఫ్యాన్స్‌లో సైతం తీవ్ర నిరుత్సాహాన్ని మిగిల్చాడు. కాగా.. మొదటి నుంచి నితిన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వీరఅభిమానిని అంటూ చెబుతూ వస్తున్నాడు నితిన్‌.

దానివల్ల ఆయన సినిమాలకు పవన్ ఫ్యాన్స్ నుంచి కూడా భారీ నెంబర్లో టికెట్లు తెగుతున్నాయి. ఓ రకంగా నితిన్ సినిమా సక్సెస్ అవ్వడానికి పవన్ ఫ్యాన్స్ కూడా కారణం. ఇలాంటి క్రమంలో పవన్ కళ్యాణ్ సినిమాల్లో సాంగ్స్, డైలాగ్స్, తన స్టిల్స్, మూవీ డైలాగ్స్ తో సహా.. ఏదో ఒక చిన్న రిఫరెన్స్ అయిన సినిమాల్లో వాడుతూ ఉంటాడు. సినిమాల్లో పవన్ రిఫరెన్స్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నాలు చేసినా నితిన్.. తాజాగా తమ్ముడు సినిమాతో పవన్ సినిమా టైటిల్ సైతం కాపీ చేసేసాడు. మరోసారి.. పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ సినిమా టైటిల్ తన సినిమా కోసం నితిన్ వాడుకోబోతున్నాడట‌.

Ojas... Gambheera - #OG 2nd Single |PawanKalyan |Sujeeth |Thaman S  |DVVDanayya

పవన్ లేటెస్ట్ మూవీ ఓజీతో సూపర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇందులో పవన్ ఓజాస్ గంభీర్‌గా ఆడియన్స్‌కు గూస్ బంప్స్ తెప్పించాడు. ఇలాంటి క్రమంలో.. నితిన్ తన నెక్స్ట్ సినిమాకు గంభీర్ అనే టైటిల్ను ఫిక్స్ చేయబోతున్నాడట. ఈ వార్తలో వాస్తవం ఎంతో తెలియదు కానీ.. ఈ టైటిల్ను ఫిక్స్ చేస్తే మాత్రం.. నితిన్ విషయంలో ఈసారి ఫ్యాన్స్ ఫైర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు నితిన్ పవన్‌ అభిమాని అని సినిమాల ప్రమోషన్స్ లో చెప్పుకుంటూ స్వార్థం కోసం పవన్ పేరు వాడుతున్నాడు తప్ప.. కళ్యాణ్ పొలిటికల్ కెరీర్ పరంగా ఏ చిన్న సపోర్ట్ ను కూడా అందించడం లేదని.. కనీసం సోషల్ మీడియాలో కూడా పవన్ సక్సెస్ విషయంలో ఒక ట్వీట్ కూడా చేయడం లేదని నితిన్ పై అభిమానులు ఫైర్ అవుతున్నారు. నిజంగానే గంభీర్ టైటిల్ నితిన్ వాడుకుంటున్నాడా.. లేదా.. తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.