ఓటీటీలో పవన్ OG.. ఆ సీన్స్ తో కలిపి స్ట్రీమింగ్.. ఎప్పుడంటే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. సుజిత్ డైరెక్షన్‌లో తెర‌కెక్కిన లేటెస్ట్ మూవీ ఓజీ.. బ్లాక్ బస్టర్ అందుకుంటున్న సంగతి తెలిసిందే. గ్యాంగ్ స్టార్ యాక్షన్ డ్రామాగా.. దసరా కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా.. పాజిఇటీవ్ టాక్ దక్కించుకోవడంతో.. అదిరిపోయే కలెక్షన్లు కొల్లగొడుతూ దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే.. ఇప్పటికే రూ.350 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించి రికార్డు క్రియేట్ చేసింది. పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అంతే కాదు.. ఇప్పటికే సినిమా ధియేటర్లలో కొనసాగుతుంది. ఈ క్రమంలోనే.. ఫుల్ రన్‌లో రూ.500 కోట్ల కలెక్షన్లు దక్కించుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

స్టైలిష్ గ్యాంగ్‌స్ట‌ర్‌గా పవన్ ఈ సినిమాలో తన స్వాగ్‌, యాక్షన్‌తో ఆకట్టుకున్నాడు. విల‌న్‌గా ఇమ్రాన్ హష్మీ నటన నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఇక.. సినిమా టాక్‌కు తగ్గట్టుగానే.. తాజాగా టికెట్ రేట్లను కూడా తగ్గించారు. ఈ క్రమంలోనే కలెక్షన్స్ మళ్లీ పుంజుకుంటున్నాయి. తాజాగా సినిమా వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.368 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టినట్లు మేకర్స్ అఫీషియల్‌గా వెల్లడించారు. చాలా చోట్ల.. సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఇలాంటి క్రమంలో.. ఓజీ.. ఓటీటీ రిలీజ్ గురించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారుతున్నాయి. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ సొంతం చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే.. నెల రోజుల్లో సినిమాను.. ఓటిటి సంస్థ స్టీమ్ చేసుకునేలా మేకర్స్ తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం అక్టోబర్ 23 నుంచి ఓజీ ఓటీటీలోకి స్ట్రీమింగ్ కానుందని టాక్. సెన్సార్ కారణంగా.. ఓజీ థియేట్రిక‌ల్ వ‌ర్షన్‌లో కొన్ని సీన్లకు కత్తెర పడిన సంగతి తెలిసిందే. అయితే.. ఓటీటీ వర్షన్‌లో మాత్రం ఈ అదనపు సీన్లను.. అలాగే నేహా శెట్టి స్పెషల్ సాంగ్ యాడ్ చేసి రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి దీనిపై అఫీషియల్ ప్రకటన రాకున్నా.. త్వరలోనే దీని నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ అనౌన్స్ చేయనుందట. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా.. మేకర్స్‌కు ఏ రేంజ్‌లో కాసుల వర్షం కురిపిస్తుందో చూడాలి.