ఓజీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ రిపోర్ట్.. పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు చాలా కాలంగా ఒక్కసరైన సక్సెస్ కూడా లేక సతమతమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. పవన్ అభిమానులు సైతం నిరుత్సాహం వ్యక్తం చేశారు. ఇలాంటి క్రమంలో తాజాగా.. పవన్ నుంచి ఓజీ సినిమా రిలీజ్ అయింది. సుజితా్‌ డైరెక్షన్‌లో ప్రియాంకా అరుళ్‌ మోహన్ హీరోయిన్‌గా, ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో మెరిసిన ఈ సినిమా.. ఫస్ట్ నుంచి ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఆడియన్స్ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్‌లో రిలీజై పాజిటివ్ టాక్‌ను దక్కించుకుంది.

ఈ క్రమంలోనే.. భారీ కలెక్షన్స్ అందుకుంటూ బ్లాక్ బస్టర్‌గా నిలుస్తుంది. ఇక తాజాగా.. సినిమా వారం రోజుల రన్ కంప్లీట్ చేసుకొని.. కలెక్షన్ల రిపోర్ట్ నెటింట‌ తెగ వైరల్‌గా మారుతుంది. సినిమాకు వారం రోజుల్లో నైజాం ఏరియాలో రూ.44.66 కోట్లు, సీడెడ్ ఏరియాలో రూ.14.25 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.12.96 కోట్లు, రూ.11.01 కోట్లు, వెస్ట్ లో రూ.7.09 కోట్లు, గుంటూరులో రూ.9.80 కోట్లు, కృష్ణాలో రూ.8.54 కోట్లు, కర్ణాటకలో రూ.9.20 కోట్లు, నెల్లూరులో రూ.3.95 కోట్లు, ఇక రెస్ట్ ఆఫ్ ఆంధ్ర‌లో రూ.4.5 కోట్లు కలెక్షన్ లను సొంతం చేసుకుంది. ఓవర్సీస్ లో అయితే రూ.30.95 కోట్ల కలెక్షన్ దక్కించుకోవడం విశేషం.

మొత్తంగా.. ఓజీ వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.156.56 కోట్ల షేర్వాసులను సొంతం చేసుకుంది. అంటే రూ.257. 5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు ఓజీ ఖాతాలో పడ్డాయి. ఈ మూవీకి రూ.172.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా.. రూ.174 కోట్ల టార్గెట్‌తో రిలీజ్ అయ్యింది. ఈ క్రమంలోనే.. మరో 17.04 కోట్ల షేర్ కలెక్షన్లు ప్రపంచవ్యాప్తంగా దక్కించుకుంటే చాలు.. క్లీన్ హీట్‌గా ఓసి నిలుస్తుంది. ప్రస్తుతం పవన్ ఈ అద్భుతమైన సక్సెస్‌ను ఫాన్స్.. తెగ‌ ఎంజాయ్ చేస్తున్నారు. కచ్చితంగా సినిమా బ్రేక్ ఈవెన్ బ్లాస్ట్‌ చేసి.. రికార్డులు కురిపించడం కాయమంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.