కాంతారా చాప్టర్ 1 పై తారక్ రివ్యూ.. ఊహకందని అద్భుతం అంటూ..!

నేడు దసరా సెలబ్రేషన్స్‌లో భాగంగా.. కోలీవుడ్ మూవీ కాంతారా చాప్టర్ 1.. పాన్‌ ఇండియా లెవెల్‌లో మేకర్స్‌ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సంచలనం సృష్టించిన కాంతారకు ఫ్రీక్వల్ గా ఈ మూవీ రూపొందింది. ఇక.. ఈ సినిమా తెలుగు ప్రమోషన్స్‌లో ఇప్పటికే ఎన్టీఆర్ తనదైన సపోర్ట్ అందించిన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా కాంతర చాప్టర్ 1 రిలీజ్ నేపథ్యంలో మరోసారి సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. మూవీ స‌క్స‌స్‌కు నా విషెస్ తెలియజేస్తున్న.. ముఖ్యంగా రిషబ్ శెట్టి ఈ సినిమాతో ఊహకందని అద్భుతాన్ని క్రియేట్ చేశాడు.

Kantara Chapter 1 First Review: ऋषभ शेट्टी की फिल्म का फर्स्ट रिव्यू आया  सामने, जानें पास हुई या फेल, मिले इतने स्टार्स

రిషబ్ పై ఉన్న నమ్మకంతో ఈ ప్రాజెక్టును నిర్మించిన హంబాలే ఫిలిం, అలాగే మూవీ టీం మొత్తానికి నా స్పెషల్ విషెస్ తెలియజేస్తున్న అంటూ తారక్ తన పోస్టులో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ కాంతర చాప్టర్ 1ను ఉద్దేశిస్తూ ఇచ్చిన రివ్యూ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. ఇక.. ఇప్పటికే సినిమా చూసిన ఆడియన్స్ సైతం మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించేసాడని.. కాంతార పాత్రలో రిషబ్ శెట్టి తప్ప మరే హీరో సెట్ అవ్వడు అనేంతలా ఆయన పాత్రలో జీవించేసాడంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Kantara: Chapter 1 Movie Review: Visually stunning and compelling film  traces the bloodlines of myth and power

డైరెక్టర్‌గా, హీరోగా వన్ మ్యాన్ షో చేసిన రిషబ్ ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్‌ తెప్పించాడని టాక్. ఇక.. హీరోయిన్ రుక్మిణి వసంత్ మూవీలో.. కనకావతి రోల్ లో యువరాణిలా మెరిసింది. ఈమె పాత సైతం ఆడియన్స్ ఆకట్టుకుందని చెప్తున్నారు. టెక్నికల్గా సినిమా చాలా రిచ్ గా ఉందని.. అడవి బ్యాక్ డ్రాప్ లో స్క్రీన్స్ కి చాలా నాచురాలిటీ కనిపిస్తుందంటూ చెబుతున్నారు. కెమెరా వర్క్, యాక్షన్, కొరియోగ్రఫీ, మ్యూజిక్, విజువ‌ల్‌ ఎఫెక్ట్స్ ఇలా ప్రతి ఒక ఆర్ట్‌ 100% ఎఫ ర్ట్స్ క్లియర్ గా కనబడ్డాయని చెప్తున్నారు. కాంతార సినిమాను చూసి ఎలాంటి అంచనాలు లేకుండా కాంతారా చాప్టర్ వన్‌కు వెళ్తే.. కచ్చితంగా సినిమా ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటుందని.. లేదంటే యావరేజ్ గా అనిపిస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే.. సినిమా కాంతార రేంజ్ లో మ్యాజిక్ క్రియేట్ చేయకపోవచ్చు.. కానీ చాలా వరకు బ్రేక్ ఈవెన్ రాబట్టి.. హిట్‌గా నిలుస్తుందని చెబుతున్నారు.