పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పిరియాడికల్ యాక్షన్ హారర్ ఎంటర్టైనర్ రాజాసాబ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మారుతి డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది. మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇక.. ఈ సినిమా తర్వాత ప్రభాస్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్‌లో స్పిరిట్ ప్రాజెక్ట్‌లో నటించనున్నాడు. ఇప్పటికే సినిమా సెట్స్‌పైకి వచ్చేందుకు అంత సిద్ధం చేసేసారు టీం. ఈ క్రమంలోనే.. తాజాగా సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ నెట్టింట తెగ వైరల్ గా మారుతుంది. ప్రస్తుతం వరస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ప్రభాస్.. త్వరలోనే స్పిరిట్ సెట్లోకి అడుగుపెట్టనున్నాడట.
ఇందులో బాలీవుడ్ బ్యూటీ తృప్తి దిమ్రి ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సెన్సేషనల్ ప్రాజెక్టులోకి ఓ మలయాళ కుట్టి సైతం యాడ్ అయింది అంటూ టాక్ నడుస్తుంది. ఇంతకీ ఆ అమ్మడు ఎవరో కాదు మడోనా సభాస్టియన్. ఇక గతంలో మడోనా నాచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో లాయర్ పాత్రలో తన నటనతో ఆకట్టుకుంది. తర్వాత.. సినిమాలో విజయ్ చెల్లెలుగా మెరిసింది. ఈ క్రమంలోనే.. ఇప్పుడు ప్రభాస్ మూవీ లో భాగం కానుందట. దీనిపై అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది.
మలయాళంలో ప్రేమమ్ సినిమాతో కెరీర్‌ను ప్రారంభించిన ఈ అమ్మడు.. తెలుగులో ప్రేమమ్ రీమేక్‌లోను నాగచైతన్యతో కలిసి మెరిసింది. అయితే.. అందం, అభినయంతో నటిగా మంచి ఇమేజ్‌ను కొట్టేసినా.. ఊహించిన రేంజ్‌లో సక్సెస్ లు మాత్రం దక్కించుకోలేకపోతుంది. ఇలాంటి క్రమంలో.. ప్రభాస్‌తో పాన్ ఇండియన్ మూవీ ఛాన్స్ రావడం విశేషం. ఈ క్రమంలోనే అమ్మడి అభిమానులంతా.. జాక్పాట్ కొట్టేసిందని.. దశ తిరిగినట్లే అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక త్వరలోనే సెట్స్ పైకి రానున్న ఈ ప్రాజెక్టులో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ రోల్‌లో కనిపించానన్నాడు.