‘ ఓజీ ‘ కి కర్ణాటకలో భారీ షాక్.. పవన్ రియాక్షన్ ఇదే

కన్నడ మూవీ కాంతారా చాప్టర్ 1 సినిమా టికెట్ ధరల పెంపకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా పర్మిషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో భారీగానే చర్చలు జరిగినట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా వెల్లడించారు. తను హీరోగా నటించిన ఓజీ సినిమాకు కర్ణాటకలో ఎదురవుతున్న ఇబ్బందులను తెలుగు సినీ వర్గాలు పవన్ దృష్టికి తీసుకు వెళ్ళారు. ఈ సినిమా పోస్టర్లు, బ్యానర్లు తొలగించే చర్యలకు దిగుతున్నారని పవన్ కు వివ‌రించారు, దీనిపై పవన్ తాజాగా రియాక్ట్ అయ్యారు. కర్ణాటకలో పరిణామాలను దృష్టిలో ఉంచుకొని.. అక్కడ సినిమాలకు ఇక్కడ ఎంకరేజ్మెంట్ ఇవ్వడం ఆపకూడదని.. మంచి మనసుతో, జాతీయ భవనాలతో.. ఆలోచనలు చేయాలంటూ కామెంట్స్ చేశాడు.

కన్నడ కంటిరాం టీ రాజ్ కుమార్ దగ్గర నుంచి కిచ్చ సుదీప్, ఉపేంద్ర, శివరాజ్ కుమార్, రిషబ్ శెట్టి వరకు ప్రతి ఒక్క క‌న్న‌డ నటుడిని తెలుగు ఆడియన్స్ ఎంతగానో ఆదరిస్తున్నారని.. సోదర భావంతో చూస్తున్నామని.. మన సినిమాకు వ్యాపార పరంగా ఎదురవుతున్న ఇబ్బందులపై.. రెండు భాషలు ఫిలిం ఛాంబర్స్ వాళ్లు చర్చించుకోవాలి.. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కి దృష్టికి తీసుకువెళతా.. కర్ణాటకలో ఎవరైనా పరిణామాలను దృష్టిలో పెట్టుకుని కాంతారా చాప్టర్ 1 కి మాత్రం ఆటంకాలు కల్పించవద్దని ప‌వ‌న్ కోరాడు.

Kantara Chapter 1 likely to get ticket rate hikes in AP

కాంతర చాప్టర్ 1 టికెట్ ధరల పెంపు విషయంలో తెలుగు సినిమా పరిశ్రమ వర్గాల నుంచి కొన్ని అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. తెలుగు సినిమాకు కర్ణాటకలో రిలీజ్ చేసే సమయంలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్నాయని.. మన సినిమాకు టికెట్ ధరల పెంపు విషయంలో అక్కడ ప్రభుత్వం అసలు సానుకూలంగా ఉండదని.. తెలుగు సినిమా పోస్టర్లు, బ్యానర్లు తొలగించ చర్యలకు అక్కడి వాళ్ళు పాల్పడుతున్నారని.. కన్నడ సినీ పరిశ్రమ నుంచి స్పందన రావడం లేదని.. తెలుగు ఇండస్ట్రీ వర్గాలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాయి. ఆర్‌ఆర్ఆర్, గేమ్ ఛేంజర్, హారిహ‌ర విరమ‌ల్లు అక్కడ తెలుగు సినిమాలకు ఏదైనా ఆటంకాలను ఇండస్ట్రీ ప్రస్తావించింది. తెలుగు సినిమాల టికెట్ ధరల విషయంలో హైకోర్టుకు కూడా వెళ్లారని తెలుస్తోంది. కాంతర చాప్టర్ 1 సహా కన్నడ సినిమాలో టికెట్ ధరల పెంపు విషయంలో గవర్నమెంట్ మరోసారి పునః ఆలోచన చేయాలని సినీ వర్గాలు వెల్లడించాయి.