ఓజీ సినిమా సక్సెస్ అయ్యిందంటే సినిమాలో హీరోతో పాటే.. డైరెక్టర్ కు కూడా క్రెడిట్ దక్కుతుంది. కథ కాసుకున్నప్పటి నుంచి దాన్ని స్క్రీన్ పై ప్రజెంట్ చేసే వరకు సినిమా కోసం కష్టపడే వ్యక్తి డైరెక్టర్. ప్రతి క్రాఫ్ట్ వాళ్లతోను పనిచేయించుకోవాలి.. తనకు నచ్చినట్లుగా సినిమాలు మలుచుకోవాలి, ప్రతి సీన్ విజువల్ లో టాప్ లెవెల్ లో ఉంచేలా కష్టపడాలి.. తెరపై ప్రతి క్యారెక్టర్ కు ప్రాణం పోయాలి.. ఇక పూర్తి సినిమా మేకింగ్ ప్రాసెస్ లో ఎక్కడ చూసినా చిన్న మిస్టేక్ జరిగిందా.. మిస్ అయ్యిందా ముందు బ్లెం చేసేది దర్శకుడినే. కనుక డైరెక్టర్ విజన్ పైనే సినిమా మొత్తం డిపెండ్ అయి ఉంటుంది.
అలా.. తాజాగా పవన్ హీరోగా సుజిత్ డైరెక్షన్‌లో రూపొందిన ఓజీ సినిమా విషయంలో.. ఓ వీడియో తెగ వైరల్ గా మారుతుంది. ఈ సినిమా ఇటీవల రిలీజై మంచి సక్సెస్ అందుకుంటున్న సంగతి తెలిసిందే. పవన్ కెరీర్‌లో ఇంతకుముందు ఎన్నడూ లేని రేంజ్‌లో ఈ సినిమా కలెక్షన్లు రాబడుతూ దూసుకెళ్తుంది. అయితే సినిమా మొత్తంలో హైలెట్ ఎపిసోడ్ ఇంటర్వెల్ బ్యాంగ్. సుజిత్ పేపర్ పై రాసుకున్న దానికంటే కూడా స్క్రీన్ పై విజువల్ గా చాలా గొప్పగా ప్రజెంట్ చేసినట్లు అర్థమవుతుంది. ఇక్కడ వరకు బానే ఉన్నా.. ఇప్పుడు ఈ ఇంటర్వెల్ సీన్ విషయంలోనే డైరెక్టర్ పై విమర్శలు మొదలయ్యాయి.
ఓ సినిమా నుంచి సీన్ కాఫీ చేశారంటూ కొన్ని వార్తలు వైరల్ గా మారుతున్నాయి. ఆ మూవీ మరేదో కాదు.. నిఖిల్ హీరోగా నటించిన యువత. సర్కార్ వారి పాట ఫేమ్ పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరో ఫ్రెండ్.. డైరెక్టర్ అవుదామని కొన్ని కథలు రాసుకుంటాడు. అందులో పవన్ కోసం ఒక కథ రాసానని.. ఇంటర్వెల్ సీన్ చాలా వైలెంట్ గా ఉంటుందని.. తన ఫ్రెండ్ కి సీప్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. తాను ఈ సినిమాలో ఏదైతే చెప్పాడో.. అదే యాజటిస్ సుజిత్ ఓజీ ఇంటర్వెల్ బెంగ తీసేశారు. ప్రస్తుతం అది చూసిన ప్రతి ఒక్కరు సుజిత్ యువత సినిమాలో ఆ నటుడు చెప్పిన సీన్ ని కాపీ చేసే స్క్రీన్ పై చూపించాడని కాస్త వైల్డ్ గా.. ప్రెసెంట్ చేశాడని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాడు.