టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ సెలబ్రిటీ ఫ్యామిలీలలో అల్లు ఫ్యామిలీ కూడా ఒకటి. ఇక ప్రజెంట్ ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్ గా అల్లు అరవింద్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అంతే కాదు.. ఆయన వారసులు అల్లు అర్జున్, అల్లు శిరీష్ లకు కూడా టాలీవుడ్ ఆడియన్స్ లో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం అల్లు అర్జున్.. పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇక అల్లు శిరీష్ సైతం.. టాలీవుడ్‌లో పలు సినిమాల్లో మెరిసాడు. గౌరవం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన శిరీష్ ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకోలేకపోయాడు.
కొత్తజంట, ఏబిసిడి, శ్రీరస్తు శుభమస్తు సినిమాలతో మంచి ఇమేజ్ను మాత్రం క్రియేట్ చేసుకున్నాడు. ఇక తర్వాత ఎన్నో సినిమాల్లో నటించినా సక్సెస్ మాత్రం అందుకోలేకపోయాడు. చివరిగా టెడ్డి సినిమా తో ఆడియన్స్‌ను పలకరించిన శిరీష్.. ఈ సినిమాతోను సక్సెస్ అందుకోలేకపోయాడు. ప్రస్తుతం ఇండస్ట్రీకి ఆయన దూరంగా ఉంటున్నారు. ఇక తాజాగా.. అల్లు కుటుంబంలో విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అల్లు రామలింగయ్య భార్య.. శిరీష్ నానమ్మ కనకరత్నమ్మ అనారోగ్య కారణాలతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. అల్లు వారి ఇంట ఓ శుభకార్యం ఫిక్స్ అయ్యారట.
ఈ క్రమంలోనే అల్లు కుటుంబంలో పెళ్లి భాజలు మోగనున్నాయని టాక్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. త్వరలోనే శిరీష్ ఓ ఇంటి వాడు కాబోతున్నాడని.. పెళ్లి పీటలు ఎక్కడున్నాడని సమాచారం. హైదరాబాద్‌కు చెందిన ఓ బడా బిజినెస్మేన్ కుమార్తెతో శిరీష్ మ్యారేజ్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. రెండు కుటుంబాల మధ్య.. ఇప్పటికే మాటలు కంప్లీట్ అయ్యాయని.. పెళ్ళికి నిర్ణయం తీసేసుకున్నట్లు సమాచారం. అయితే.. ఈ మధ్యలో అల్లు కనక రత్నం అనూహ్యంగా చనిపోవడంతో శుభకార్యం వాయిదా పడినా.. త్వరలోనే ఎంగేజ్మెంట్ చేసి, పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేయాలని ఫ్యామిలీ భావిస్తున్నారట. ఈ క్రమంలోనే అల్లు శిరీష్ ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.