నేను ఇప్పటి వరకు చిరంజీవి, రామ్ చరణ్ లతో సినిమా అందుకే చేయలేదు.. సుజిత్

ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం ఓజీ మానియా కొనసాగుతుంది. ఈ క్రమంలోనే మూవీ డైరెక్టర్ సుజిత్ పేరు మారుమోగిపోతుంది. పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఈ సినిమా.. గురువారం గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ అయింది. మొదటి రోజు ఫస్ట్ షో నుంచే పాజిటీవ్‌ టాక్ తెచ్చుకుని కలెక్షన్ పరంగా రికార్డులు సృష్టిస్తుంది. ఈ క్రమంలోనే సుజిత్ సినిమా సక్సెస్‌లో భాగంగా పలు ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేస్తున్నాడు. ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంటున్నాడు. అలా.. తాజాగా చిరంజీవి, రామ్ చరణ్‌తో వేర్వేరుగా సినిమాలు చేయాలనుకున్నా.. ఎందుకు చేయలేకపోయాడు.. అతడు, ఓజీ మూవీలకు మ‌ధ్య‌న మడ్‌రేషన్ ఏంటి అనే విషయాలను షేర్ చేసుకున్నాడు.

సుజిత్ మాట్లాడుతూ.. సాహో తర్వాత బ్రేక్ తీసుకోవాలని నేను అనుకోలేదు.. ఆ మూవీ రిలీజ్ అయిన వెంటనే చరణ్ తో యూకే బ్యాక్ డ్రాప్‌లో సినిమా చేయాలని భావించా. కానీ.. అదే టైంలో కోవిడ్ ప్రారంభం అవడం.. షూటింగ్ చేసే ఛాన్స్‌ లేకపోవడం.. ప్రాజెక్టు అంతకంతకు లేట్ అవ్వడంతో లూసిఫర్ రీమేక్ సంబంధించి చిరంజీవి గారిని కలిసా. ఆ మూవీ డైరెక్టర్, యాక్టర్ పృథ్వీరాజ్ సుక్కుమారన్ సినిమాటోగ్రాఫర్ సుజిత్ వాసుదేవ్‌తోను మాట్లాడా. సాహో కథ‌ ప్రపంచం తనకు నచ్చిందని పృథ్వీరాజ్ గారు చెప్పారు. నా ఒరిజినల్ ప్రోడక్ట్ వాళ్లకు నచ్చి మూవీ ఛాన్స్ ఇవ్వాలనుకున్నారు.. అలాంటప్పుడు రీమేక్ అవసరం లేదనిపించింది అంటూ సుజిత్ వివరించాడు. అలా చ‌ర‌ణ్, చిరు సినిమాల‌ను సుజిత్ మిస్ చేశాడ‌ట‌.

ఇక పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబో కాయం కావడానికి కారణం డైరెక్టర్ త్రివిక్రమ్ అని.. ఇప్పటికే పవన్ చెప్పారు. త్రివిక్రమ్ లేనిదే.. ప్రాజెక్ట్ లేదని ప్రొడ్యూసర్ డివివి దానయ్య సైతం వివరించాడు. ఇక‌ త్రివిక్ర‌మ్‌ ఈ సినిమా విషయంలో ఎంత చొరవ తీసుకున్నారో వీళ్ళ మాటలను బట్టి అర్థమవుతుంది. సుజిత్ ఫేవరెట్ సినిమాలో త్రివిక్రమ్ తీసిన అతడు మూవీ ఒకటి. ఈ సినిమాని ఎన్నోసార్లు చూసి బ్రేక్డౌన్ చేశానని.. అలా అతడులో పార్ధు పాత్ర మరణంతో అసలు కథ మొదలైనట్టే.. ఓజీలోను అదే పాత్ర చావుతో అసలు స్టోరీ ప్రారంభమవుతుందంటూ చెప్పుకొచ్చాడు.

ఇక పవన్ కళ్యాణ్ సినిమాలో జానీ అంటే నాకు చాలా ఇష్టం.. ఆ మూవీ చూసిన తర్వాత ఎప్పటికైనా పవన్ కలవాలని ఫిక్స్ అయ్యా అంటూ చెప్పుకొచ్చారు. ఇక తన ఫేవరెట్ హీరోతో తాజాగా ఓజీ సినిమా చేసి సక్సెస్ అందుకున్నాడు సుజిత్. ఇక జానీలో హీరోయిన్ రోల్ పేరు గీత. ఓజీలో శ్రియ రెడ్డి రోల్‌ సైతం అదే పేరుతో డిజైన్ చేశాడు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ కావడంతో కీ రోల్స్‌కు పాత పాత్రల పేర్లు పెట్టాలనుకున్నామని.. ఆ లిస్టులోనే గీతా ఉండడంతో ఆటోమేటిక్‌గా ఆ పేరు పెట్టేశామంటూ సుజిత్ వివరించాడు. జానీ లోని లెట్స్‌గో జానీ సాంగ్, తమ్ముడు లోని ట్రావెలింగ్ సోల్జర్ సాంగ్.. ఓజి కోసం రీమేక్ చేశారు.