బాలయ్య ఫ్లాప్ కు తానే కారణమని అప్సెట్ అయినా వెంకటేష్.. టాలీవుడ్ హిస్టరీలో నెవర్ బిఫోర్ వార్

టాలీవుడ్ సీనియ‌ర్‌ స్టార్ హీరోస్ బాలకృష్ణ, వెంకటేష్ లకు ప్రత్యేక పరచయాలు అవసరం లేదు. నందమూరి నట‌సింహం బాలయ్య.. తనదైన మార్క్‌ క్రియేట్ చేసుకుని వరుస సినిమాలతో దూసుకుపోతుంటే.. మ‌రోప‌క్క‌ విక్టరీ వెంకటేష్ ఆడియ‌న్స్‌ను ఎంట్ర‌టైన్ చేస్తు మంచి రిజ‌ల్ట్ అందుకుంటున్నాడు. ఇలాంటి క్రమంలో.. వెంకటేష్, బాలకృష్ణ లకు సంబంధించిన ఓ వివాదం వైరల్ గా మారుతుంది. కొన్ని దశాబ్దాల క్రితం బాలయ్య, వెంకీ ల‌ మధ్య టాలీవుడ్ హిస్టరీలోనే అంత‌క‌ముందెన్న‌డు జ‌ర‌గ‌ని రేంజ్‌లో వివాదం చోటుచేసుకుంది. ఈ సంఘటనలో చాలా ట్విస్ట్‌లు ఉన్నాయి. ఈ గొడవ వల్లే బాలయ్య సినిమా ఫ్లాప్ అయ్యి.. భారీ నష్టం జరిగింది. ఈ రిజ‌ల్ట్ తన‌ వల్లే అని వెంకీ ఫీల్ అయ్యాడు. ఇంతకీ అసలు బ్యాటరీ ఏంటంటే.. 1989లో జూన్ 26 వెంకటేష్ నటించిన ధృవ నక్షత్రం రిలీజ్ అయింది.

Dhruva Nakshatram Super Hit Telugu Full Movie | Victory Venkatesh | Rajini  | Brahmanandam | TFN

కరెక్ట్ గా ఈ సినిమాకు 3 రోజుల వ్యవ‌ధిలో బాలయ్య నటించిన అశోక్ చక్రవర్తి సినిమా.. అంటే జూలై 29న రిలీజ్ అయింది. ఇక్కడ అసలు ట్విస్ట్‌ ఏంటంటే.. రెండు సినిమాల కథ ఒకటే కావడం. దీంతో.. మొదట రిలీజ్ అయిన ధృవ నక్షత్రం చివ‌ర‌కు ఆడియన్స్‌లో పాజిటివ్ టాక్ ద‌క్కించుకుంది. ఆ ఎఫెక్ట్ బాలయ్య సినిమాపై పడింది. ధృవ నక్షత్రం సినిమా చూసిన ఆడియన్స్‌ అశోక చక్రవర్తి సినిమాను చూసి షాక్ అయ్యారు. బాలయ్య కూడా సినిమా చేశాడని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దీంతో బాలయ్య సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది. వెంకటేష్ మూవీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. కాగా బాల‌య్య‌ నటించిన‌ అశోక చక్రవ‌ర్తి సినిమా మలయాళం బ్లాక్ బస్టర్ మోహన్లాల్ ఆర్యన్ సినిమాకు రీమేక్ గా వచ్చింది. ఈ సినిమా రీమేక్ హక్కులను అశోక్ చక్రవర్తి రూ.3 లక్షలకు దక్కించుకున్నారు.

Watch Ashoka Chakravarthy (Telugu) Full Movie Online | Sun NXT

చిన్న చిన్న మార్పులతో సినిమా తీసేశారు. దీనివల్ల అప్పట్లో టాలీవుడ్‌లో పెద్ద వివాదమే జరిగింది. అశోక్ చక్రవర్తి నిర్మాతలు.. దృవ నక్షత్రం పై తమ కొనుగోలు చేసిన సినిమా కథ‌ని ఎలా మీరు కాపీ చేస్తారంటూ మండిపడ్డారు. ఈ వివాదం పెరగడంతో వెంకటేష్ ఎంట్రీ ఇచ్చి జరిగిన తప్పుకు క్షమాప‌ణ‌లు తెలియజేశాడు. దృవ న‌క్షత్రం క‌థ‌ బాలయ్య సినిమా కథలో ఉందని విషయం నాకు రిలీజ్ అయిన తర్వాత తెలిసిందని.. ముందే తెలిసి ఉంటే సినిమాలు అసలు ఆపేసేవాడినంటూ క్లారిటీ ఇచ్చాడు. ఇక బాలయ్య కూడా వివాదాన్ని పెంచడం ఇష్టం లేక.. సైలెంట్ గా ఉండిపోయాడు. ఇక్కడ అన్నిటికంటే బిగ్ ట్విస్ట్ రెండు సినిమాల రచయితలు ఒక్కరే. వాళ్లే పరుచూరి బ్రదర్స్. ఈ రెండు సినిమాలు కథలు రాసేటప్పుడు వీళ్ళు కనీసం కథ‌ ఒకేలా ఉందని అలోచించకపోవడం.. ఇంత పెద్ద వివాదానికి దారి తీసింది. ఇప్పటివరకు మరోసారి టాలీవుడ్ లో అలాంటి వివాదం జరగలేదు.