ఇండియన్ సినీ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన టాలీవుడ్ సినిమాల్లో కల్కి 2898 ఏడి ఒకటి. నాగ అశ్విన్ డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లకు పైగా గ్రాస్ వసూళను కొల్లగొట్టి రికార్డులు క్రియేట్ చేసింది. ఇక సినిమాలో బాలీవుడ్ స్టార్ ముద్దుగుమ్మ దీపికా పదుకొనే కీలక పాత్రలో మెరిసిన సంగతి తెలిసిందే. కథ మొత్తం ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఇక ఇలాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు సిక్వెల్ ఉంటుందని మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ క్రమంలోనే కల్కి హిట్ తర్వాత.. ఆడియన్స్ అంతా కల్కి 2 కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
ఇలాంటి క్రమంలో.. సినిమాకు సంబంధించిన షాకింగ్ అప్డేట్ వైరల్‌గా మారుతుంది. అసలు మ్యాటర్ ఏంటంటే.. ప్రధాన సూత్రధారిగా సినిమాల్లో ఆడియన్స్‌ను ఆకట్టుకున్న దీపిక పదుకొనే.. కల్కి 2లో కనిపించదట. ఈ వార్తలు ఎప్పటి నుంచో నెటింట వైరల్ గా మారుతున్నాయి. తాజాగా దీనిపై మేకర్స్ అఫీషియల్ ప్రాకటించారు. వైజయంతి మూవీస్.. ఎక్స్ అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని షేర్ చేసుకున్నారు. దీపికా పదుకొనే కల్కి 2లో భాగం కాదని.. చాలా ఆలోచించి మేము ఈ నిర్ణయాన్ని తీసుకున్నామంటూ వివరించారు.
మొదటి భాగాన్ని చేసేటప్పుడు చాలా సుదీర్ఘ ప్రయాణం చేశామని.. ఇలాంటి ఓ మంచి ప్రాజెక్టుకు కావాల్సిన కమిట్మెంట్స్ మాకు ఆమె నుంచి కనిపించడం లేదంటూ షాకింగ్ నోట్ రిలీజ్ చేశారు. ఇక తన భవిష్యత్తు ప్రాజెక్ట్‌లకు విషెస్ తెలియజేస్తున్నామంటూ వివరించారు. ఈ ప్రకటన ప్రస్తుతం నెటింట వైరల్‌గా మారడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. అంతటి బడా ప్రాజెక్ట్ నుంచి దీపికను తప్పించడానికి అసలు కారణాలు ఏమీ ఉంటాయి.. అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతుందని.. చర్చలు ఇప్పటికే మొదలైపోయాయి. ప్రధానంగా ఈ ప్రాజెక్టుకు అవసరమైన స్థాయి కమిట్మెంట్ ఆమె చూపించలేదని మేటర్ ను ప్రొడక్షన్ టీమ్ స్వయంగా వెల్లడించారు. ఈ క్రమంలోనే కల్కి 2లో దీపికను రిప్లేస్ చేయనున్న ఆ ముద్దుగుమ్మ ఎవరో తెలుసుకోవాలని ఆసక్తి అందరిలో మొదలైంది.