పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. సుజిత్ డైరెక్షన్లో రూపొందిన లేటెస్ట్ మూవీ ఓజి. మరో 8 రోజుల్లో గ్రాండ్ లెవెల్ లో ఆడియన్స్‌ను పలకరించనుంది. ఇక ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్ ఆడియన్స్‌లో భారీ హైక్ నెలకొల్పిన ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. కేవలం 2 గంటల 30 నిమిషాలు నడివితో ఆడియన్స్‌లో పలకరించనున్న క్రమంలో సినిమా సెన్సార్ టాక్ కూడా ఆడియన్స్‌లో మరింత అంచనాలను పెంచేసింది. కాగా.. ఇలాంటి క్రమంలో సినిమా అడ్వాన్స్ బుకింగ్ సంబంధించిన న్యూస్ తెగ వైరల్ గా మారుతుంది.
శనివారం లేదా.. ఆదివారంలో ఇండియన్ వైడ్‌గా సినిమా ఓపెన్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయట. దీనికి సంబంధించిన ఆఫీషియల్ ప్రకటన త్వరలోనే మేకర్స్ ఇవ్వనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన టికెట్ కాస్ట్, హైక్ జీవోలు ఈనెల 20కి గవర్నమెంట్ రిలీజ్ చేస్తాయని మేకర్స్ భావిస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే.. ఇప్పటికే సినిమాకు ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలై.. మైండ్ బ్లోయింగ్ లెవెల్లో సేల్స్ జరుగుతున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
8 రోజులు సమయం ఉండగానే ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్‌లో 2 మిలియన్ డాలర్ల గ్రాస్ కొల్లగొట్టేసింది. ఓజీ అంటే ఇండియన్ కరెన్సీ లెక్కల్లో రూ.18 కోట్ల గ్రాస్ వసూళ్లు రానే వచ్చేసాయి. ఇంకా ఫుల్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్ లో ప్రారంభం అయితే.. ఏకంగా రూ.100 కోట్ల గ్రాస్ మార్క్‌ను సినిమా టచ్ చేసి అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇప్పటివరకు రిలీజ్‌కు ముందే రూ.100 కోట్లు కొల్లగొట్టిన సినిమాలు చాలా తక్కువ. ఆర్ఆర్ఆర్, పుష్ప 2, కూలి మాత్రమే రికార్డును టచ్ చేశాయి. ఇప్పుడు ఓజీ సినిమా ఈ లిస్టులో చేరిపోనుందట. డైరెక్టర్ పెద్ద ఫేమ్ లేకపోయినా.. పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్ గా కనిపించనుండటంతో సినిమా పై భారీ హైప్ మొదలైంది.
ప్రస్తుతం సినిమా అడ్వాన్స్ బుకింగ్ లో చూపిస్తున్న జోరు చూస్తుంటే.. తారక్ నటించిన దేవర ఫుల్ రన్ టార్గెట్.. కేవలం నాలుగు రోజుల్లోనే చిత్తుచిత్తు చేసేస్తుందని అభిప్రాయాలు పవన్ అభిమానుల వ్యక్తం చేస్తున్నారు. దేవరకు ఫుల్ రన్లో రూ.50 కోట్లు వచ్చాయి. ఓజీ సినిమాకు మొదటి రోజే రూ.25 కోట్లకు పైగా గ్రాస్ వచ్చేస్తుందని.. వికెండ్కల్లా దేవర క్లోజింగ్ కలెక్షన్స్ సులువుగా దాటేస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమాకు పాజిటివ్ టాక్ రావడమే ఆలస్యం.. కచ్చితంగా ఇది జరిగిన ఆశ్చర్యపోనవసరం లేదంటూ ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక సినిమా టాక్‌ను బట్టి పవన్ పర్ఫెక్ట్ సినిమాగా ఓజీ నిలుస్తుందా.. లేదా.. వేచి చూడాలి.