NTR 31.. గూస్ బంప్స్ అప్డేట్.. తారక్ కోసం రంగంలోకి మరో పాన్ ఇండియన్ హీరో..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌లో క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే తను నటిస్తున్న అన్ని సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలే కావడం విశేషం. ఇక ఇటీవల వార్ 2 సినిమాతో బాలీవుడ్‌లో డబ్యూ ఇచ్చిన తారక్.. ఈ సినిమాతో మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకున్నాడు. ఏ క్రమంలోనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌తో ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలని కసితో ఉన్నాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో తారక నటిస్తున్న సంగతి తెలిసిందే. రుక్మిణి వసంత హీరోయిన్గా.. డ్రాగన్ రన్నింగ్ టైటిల్‌తో ఈ సినిమా రూపొందుతుంది. ఇక సినిమా షూట్ మొత్తం ఎక్కువగా కర్ణాటకలోనే జరుపుకుంటున్నారు టీం. కాగా.. కర్ణాటకలోని ఎన్టీఆర్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలోనే.. కన్నడ భాష సైతం నేర్చుకుని అక్కడ అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు.

ఇక ఇప్పుడు రూపొందుతున్న డ్రాగన్ తో కర్ణాటక ఆడియన్స్‌కు మరింత చేరువ‌వాలని తారక్ ప్రయత్నాలు చేస్తున్నాడట. ఈ క్రమంలోనే సినిమాలో మరో పాన్ ఇండియన్ స్టార్ హీరోని రంగంలోకి దింపుతున్నారని.. అది కూడా ఒక కన్నడ హీరో అంటూ టాక్ నెటింట‌ తెగ వైరల్‌గా మారుతుంది. ఇంతకీ ప్రశాంత్ రంగంలోకి దింపుతున్న ఆ హీరో మారెవరో కాదు.. కాంతారా ఫేమ్‌.. రిష‌బ్‌ శెట్టి. ఎస్‌.. డ్రాగన్ సినిమాలో రిషబ్ శెట్టి ఒక గెస్ట్ రోల్‌లో మెర‌వనున్నాడని న్యూస్ ప్రస్తుతం కన్నడ మీడియాలో కోడై కూస్తుంది. ముఖ్యంగా ఎన్టీఆర్, రిషబ్ మధ్య‌ ఉన్న మంచి బాండింగ్ గతంలో చాలా సందర్భాల్లో రివీల్ అయింది.

Rishab Shetty, Jr NTR make a spiritual visit to Keshavanatheshwara Temple

వీళ్ళిద్దరూ కలిసి ఫ్యామిలీలతో ట్రిప్స్, టెంపుల్స్ అంటూ ఎంజాయ్ చేసిన ఫిక్స్ వైరల్ గా మారాయి. ఇప్పుడు వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉన్న ఈ బాండింగ్ తోనే రిషబ్ శెట్టి ఎన్టీఆర్ సినిమాలో గెస్ట్ రోల్ చేయడానికి ఒప్పుకున్నాడట. అంతేకాదు.. రిషిబ్‌ సెట్టి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి ప్రశాంత్ నీల్‌ కూడా ఒక కారణమని తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఆయన కాంతారా చాప్టర్ 1 షూట్ లో బిజీబిజీగా గడుపుతున్నాడు. ఇక ఈ సినిమా వచ్చే నెల 2వ‌ తేదీన గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమా పనులన్నీ పూర్తయి రిలీజ్ అయిన వెంటనే ఎన్టీఆర్ డ్రాగన్ సెట్స్ లోకి రిషబ్ శెట్టి జాయిన్ అవుతాడని తెలుస్తోంది. మరి ఇందులో వాస్తవం ఎంతో తెలియదు కానీ.. ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాలో రిషబ్ గెస్ట్ రోల్ అని టాక్ రావ‌డంతో టాలీవుడ్ ఆడియన్స్‌లో మంచి హైన్‌ మొదలైంది.