” స్పిరిట్ లో ” ప్రభాస్ లుక్ చూస్తే నా ట్రాల్లెర్స్ కు వణుకు పుడుతుంది.. సందీప్ రెడ్డి వంగ

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ.. తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్తో దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో సందీప్ రెడ్డి ఒకడు. ఇండస్ట్రీకి ఓ సరికొత్త కోణాన్ని పరిచయం చేసాడు సందీప్. ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు వైవిధ్యమైన స్క్రీన్ ప్లే, డైలాగ్స్ తో, కథను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్తాడు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు తను తెర‌కెక్కించిన ప్రతి సినిమాతో బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకున్నాడు. పాన్ ఇండియా లెవెల్‌లో సెన్సేషనల్ డైరెక్టర్ గా మారాడు. ఇక ప్రస్తుతం ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేసేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ బిజీగా గడుపుతున్నాడు సందీప్.. ఇక సినిమాపై నెక్స్ట్ లెవెల్ లో హైప్‌ మొదలైంది.

ఈ క్ర‌మంలోనే ఆయన సినిమా గురించి మాట్లాడుతూ.. ప్రభాస్ తో చేస్తున్న స్పిరిట్ కచ్చితంగా గొప్ప సినిమా అవుతుందంటూ ధీమా వ్యక్తం చేశాడు. ఇప్పటివరకు తను చేసిన సినిమాలన్నీ ఒక్క ఎత్తు అయితే.. ఇప్పుడు చేస్తున్న స్పిరిట్ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందంటూ ఆయన రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. గత సినిమాలపై ట్రోల్స్ చేసిన ట్రోలర్స్ అందరికీ స్పిరిట్ స్ట్రాంగ్ కౌంటర్ అని.. ఈ సినిమాలో ప్రభాస్ లుక్ చూసి అంతా షేక్ అయిపోతారంటూ వివరించాడు. ఆయన క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా తీర్చిదిద్దానని వివరించాడు. ఇక గతంలో సందీప్ రెడ్డి తెర‌కెక్కించిన అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలు చాలామందిని ఆకట్టుకున్నా.. కొంతమంది మాత్రం బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉందన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ నెగిటివ్ కామెంట్స్ చేశారు.

అంతేకాదు.. బోల్డ్ సినిమాలు తప్ప సందీప్ రెడ్డి వంగ సినిమాలు అంటే మరేం ఉండదని కామెంట్లు కూడా వినిపించాయి. వాళ్ళందరికీ సందీప్ లేటెస్ట్ కామెంట్స్ తో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. స్పిరిట్ అనేది ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ సినిమాగా రూపొందనుంది. ఇందులో ప్రభాస్ నెక్స్ట్ లెవెల్ లో కనిపించనున్నాడట. దానికి తగ్గట్టుగానే సినిమాలో అయినా ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాడు.. దాంతో ఎలాంటి క్రేజ్ ను సంపాదించుకుంటాడు అనే ఆసక్తి డార్లింగ్ ఫ్యాన్స్ లో మొదలైంది. ఒకవేళ ఈ సినిమాతో సందీప్ రెడ్డి పాజిటీవ్ టాక్ తోచ్చుకుంటే మాత్రం ఈ సినిమాకు రూ.2 వేల‌ కోట్లకు పైన కలెక్షన్లు వస్తాయనటంలో సందేహం లేదు. అయితే.. సందీప్ మాట్లాడుతూ కేవలం ప్రభాస్ ఫ్యాన్స్‌ కాదు.. సాధర‌ణ‌ ఆడియన్స్ సైతం ఈ సినిమాతో పాన్ వరల్డ్ రేంజ్ లో ప్రభాస్‌కు ఫిదా అవుతారంటూ కామెంట్లు చేశాడు.