” ఓజీ ” ఫ్రీ రిలీజ్ లో ఫ్యాన్స్ కు డబల్ ట్రీట్.. అసలు ఊహించని గెస్ట్ ఎంట్రీ..!

టాలీవుడ్ పవర్ స్టార్.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ఓజీ. మోస్ట్ అవైటెడ్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు సుజిత్ దర్శకుడిగా వ్యవహరించాడు. ఇక ఈ సినిమాలో పవన్ ఓజాస్ గంభీర్.. అనే పవర్ఫుల్ గ్యాంగ్ స్టార్ రోల్లో మెరమన్నారు. డివి దానయ్య ప్రతిష్టాత్మకంగా.. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక‌ సెప్టెంబర్ 25న ఈ మూవీ గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఇక సినిమా నుంచి పవన్ బర్త్ డే కానుకగా రిలీజ్ అయిన గ్లింప్స్‌ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సినిమా హైప్‌ను రెట్టింపు చేశాయి. అయితే.. ప్రస్తుతం టాలీవుడ్‌లో సినిమాల రిజల్ట్ చాలా విచిత్రంగా ఉంటుంది. భారీ అంచనాలతో, బడా బడ్జెట్తో రూపొందిన ఈ బ‌డా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాప్ గా నిలుస్తున్నాయి.
ఎలాంటి సందడి లేకుండా కామ్‌గా వచ్చిన చిన్న సినిమాలు తమ కంటెంట్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకుని సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ రకంగా టాలీవుడ్ ఆడియన్స్ సైతం పెద్ద సినిమా అంటే మక్కువ చూపలేకపోతున్నారు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అభిమానుల అందరి ఆశ‌లు ఓజీ పైనే ఉన్నాయి. ఓజి సినిమా ఇప్పుడు వరకు వచ్చినా బడా బ‌డ్జ‌ట్ ఫ్లాప్ సినిమాల ధోరణికి చెక్ పెడుతుందని అంత భావిస్తున్నారు. ఇక ట్రేడ్ వర్గాల్లో సైతం సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌ రెండు ప్రాంతాల్లో గ్రాండ్గా ఏర్పాటు చేయాలని నిర్మాతలు భావించారట.
ఒకటి విజయవాడలో ఈ నెల 19న నిర్వహించనున్నట్లు టాక్. అలాగే మరొకటి ఈ నెల 21న హైదరాబాద్లో గ్రాండ్ గా ఏర్పాటు చేయనున్నారు అని తెలుస్తుంది. దీనిపై అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది. అయితే హైదరాబాద్ లో ఏర్పాటు చేసే రిలీజ్ ఈవెంట్ కు మాత్రం ఫ్యాన్స్ లో డబల్ ట్రీట్ పెంచే ఓ స్పెషల్ గెస్ట్ హాజరు కాబోతున్నాడట. ఇంతకీ ఆ గెస్ట్‌ ఎవరో అసలు ఊహించలేరు. అతను మరెవరు కాదు మెగాస్టార్ చిరంజీవి. ఎస్ పవర్ స్టార్ ఓజి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కోసం మెగాస్టార్ చిరంజీవి సందడి చేయనున్నాడట. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు కానీ.. ఇదే నిజమైతే మాత్రం మెగా ఫాన్స్ కు డబల్ ట్రీట్ ఖాయం అనడంలో సందేహం లేదు. ఇక మెగాస్టార్.. ఓజీ ప్రమోషన్స్ కి వస్తే సినిమా గురించి ప‌వ‌న్ గురించి ఏం మాట్లాడుతారో అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది.