పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డివంగా కాంబోలో రూపాంతన్న మోస్ట్ అవైటెడ్ మూవీ స్పిరిట్. ఇంకా సినిమా సెట్స్ పైకి రాకముందే ఈ ప్రాజెక్ట్ ఆడియన్స్‌లో మాత్రం భారీ హైప్ నెలకొల్పింది. ఇలాంటి క్రమంలో సినిమాపై సందీప్ రెడ్డి మాస్ అప్డేట్‌ను ఇవ్వడం డార్లింగ్ ఫ్యాన్స్ లో కొత్త ఊపు తెప్పిస్తుంది. ఓ టీవీ ఈవెంట్లో పాల్గొని సందడి చేసిన సందీప్ రెడ్డివంగా.. స్పిరిట్ సినిమా పై మాట్లాడుతూ త్వరలోనే షూట్ ప్రారంభమవుతుందని.. ఇప్పటికే బిజీఎం పనులు 70% కంప్లీట్ అయ్యాయంటూ చెప్పుకొచ్చాడు. యానిమల్ టైం లో లాగానే.. ముందుగా మ్యూజిక్ వర్క్ కంప్లీట్ చేసి సీన్ అవుట్ ఫుట్ ఎలా వస్తుందో అంచనా వేస్తాం.. ఇది టైం, ప్రొడక్షన్ బడ్జెట్ రెండింటిని సేవ్ చేస్తుందంటూ సందీప్ వివరించాడు.
ఇక ప్రభాస్ గురించి ఆయన మాట్లాడుతూ.. చాలా నిజాయితీ గల వ్యక్తి. ప్రభాస్ కోపం లేకుండా పనిచేస్తాడు. స్టార్ అన్న అహంకారం ఆయనలో ఏ మాత్రం ఉండదు. నేను ఊహించ్చిన దానికన్నా ఎక్కువగానే ఆయన నా సినిమా కోసం కోపరేట్ చేస్తున్నాడు. త్వరలో సెట్స్‌పైకి వస్తాం అంటూ వివరించాడు. అంతేకాదు.. స్పిరిట్‌లో ప్రభాస్ రెండు డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించనున్నారు అని టాక్. ఇందులో ఓ పాత్ర పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సందీప్ దీనిపై క్లారిటీ కూడా ఇచ్చేశాడు. ఇక రెండోది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్. ఇందులో మాఫియా డాన్ గా ప్రభాస్ కనిపించనున్నాడట.
ఈ మాస్ మిక్స్డ్ క్యారెక్టర్లతో సినిమా హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్గా ఆడియన్స్ను పలకరించనిందని.. అర్జున్ రెడ్డి, యానిమల్ మించిపోయే రేంజ్‌లో బ్లాక్ బస్టర్ సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాతో ప్లాన్ చేస్తున్నాడు అంటూ తెలుస్తుంది. అయితే.. ప్రస్తుతం వరస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ప్రభాస్.. స్పిరిట్ కోసం.. సందీప్ రెడ్డి వంగా కండిషన్స్ ప్రకారం.. ఆ ప్రాజెక్టులన్ని పూర్తి చేసి సెట్స్ లోకి అడుగుపెట్టనున్నాడట. స్పిరిట్ ప్రారంభమైన తర్వాత మరే సినిమా చేయకూడదని ఆయన పెట్టిన కండిషన్స్‌కు సైతం ప్రభాస్ గురించి సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. అందుకే దాదాపు అర్జెంట్ ప్రాజెక్ట్స్ అన్నింటిని ముందుగానే కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది.