పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ. సుజిత డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా మోస్ట్ అవైటెడ్ మూవీగా ఆడియన్స్‌ను పలకరించనున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 25న గ్రాండ్‌గా రిలీజ్ కానున్న ఈ సినిమాపై.. ఇప్పటికే ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్లో అంచనాలు నెలకొన్నాయి. దీనికి బిగ్గెస్ట్ ఎగ్జామ్పుల్ నార్త్ అమెరికాలో ఓపెన్ బుకింగ్స్ లో ఓజీ సృష్టిస్తున్న రికార్డులే. సినిమా రిలీజ్ ఇంకా 20 రోజులు ఉండగానే సినిమా వన్ మిలియన్ డాలర్ గ్రాస్ మార్క్ టచ్ చేసిందంటే.. సినిమాకు ఉన్న క్రేజ్ ఏంటో అర్థం అవుతుంది. ఇక ప్రస్తుతం ఉన్న ఊపు చూస్తుంటే.. కచ్చితంగా సినిమా ప్రీమియర్ షోస్ నుంచి నాలుగు మిలియన్ డాలర్లకు పైగా గ్రస్ వసూళ్లు కొల్లగొట్టి.. ఆల్ టైం రికార్డ్ ను క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
నార్త్ అమెరికాలోనే ఈ రేంజ్లో క్రేజ్ ఉంటే.. తెలుగు రాష్ట్రాల్లో పవనిజం ఏ రేంజ్ లో పొంగుతుందో అర్థం చేసుకోవచ్చు. అయితే.. సినిమాకు మేకర్స్ మాత్రం.. ఊహించిన రేంజ్ లో ప్రమోషన్స్ చేయలేకపోతున్నారనే కంప్లైంట్ మాత్రం వినిపిస్తుంది. ఇలాంటి క్రమంలో ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇచ్చేయాలని మేకర్స్ ఫిక్స్ అయిపోయారట. ఈ వీకెండ్ నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్లతో మోత మోగించేస్తారని సమాచారం. ఇక ఈ వీకెండ్లో సినిమాపై గూసుబాంబ్స్ అప్డేట్ వస్తుందంటూ టాక్ నడుస్తుంది. వీకెండ్ అంటే రేపే.. శనివారం సినిమాపై అప్డేట్ రానుందట. ఇందులో వాస్తవం ఎంతో వేచి చూడాలి. ఇక ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ గురించి మాత్రం ఓ టాక్ నడుస్తేంది.
ముందుగా ట్రైలర్ సెప్టెంబర్ 19న రిలీజ్ చేయాలని భావించిన మేకర్స్.. అప్పటికి మరింత ఆలస్యం అయిపోతుందని.. జనాల్లోకి సినిమా గట్టిగా వెళ్లాలంటే ముందే ట్రైలర్ రిలీజ్ చేసి తీరాల్సిందే అనే ఉద్దేశంతో సెప్టెంబర్ 15 కు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. త్వరలో దీనికి సంబంధించిన అప్డేట్ అఫీషియల్ గా రానుంది. ట్రైలర్లో డైలాగ్స్ ఫ్యాన్స్ కి మెంటల్ ఎక్కించేలా ఉంటాయని.. ముఖ్యంగా కొన్ని షాట్స్ అయితే ఊహించని రేంజ్ లో డిజైన్ చేసినట్లు తెలుస్తుంది. ట్రైలర్ కట్‌తోనే సినిమా పై అంచనాలు ఆకాశానికి అంటేలా సుజిత్ పక్కాగా ప్లాన్ చేశాడట. ఇక ట్రైలర్ ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. ఇప్పటికే ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్‌ని ఈ మూవీ షేక్ చేస్తోంది. ఇక ట్రైలర్ కంటెంట్ క్లిక్ అయితే ప్రీమియర్ షోస్ గ్రాస్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఇక సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్ర ప్రదేశ్, వైజాగ్ ఏరియాలో సెప్టెంబర్ 19న ఏర్పాటు చేస్తున్నారట మేకర్స్.