కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ లేటెస్ట్ మూవీ మదరాసి. ప్రమెక డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్.. తమిళ్ ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీ మూవీస్ బ్యానర్ పై రూపొందింది. సినిమాలో బాలీవుడ్ యాక్టర్ విద్యుత్ జమ్వీల్, మలయాళ నటుడు బిజు మీనన్, విక్రాంత్ షాబీర్, రుక్మిణి వసంత్ తదితరులు కీలకపాత్రలో మెరిశారు, ఇక సినిమా తమిళ్‌తో పాటు.. తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోను పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది. సుమారుగా రూ.200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు.. అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా, శ్రీకర ప్రసాద్ అక్కినేని ఎడిటర్‌గా, సుదీప్ ఎలమన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఇక సినిమా భారీ విజువల్ ఎఫెక్ట్స్ కోసం.. నాక్ స్టూడియోస్, ఫాంటమ్ ఎఫెక్ట్స్, బెస్ట్ బెల్స్ కంపెనీలు పని చేశాయి.
ఈ సినిమా ప్రీమియర్లు నార్త్ అమెరికాలో.. ఇతర దేశాల్లో ఇప్పటికే ముగియడంతో సినిమా చూసిన అడియన్స్ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఇక కథ విషయానికి వస్తే.. తమిళనాడు నార్త్ ఇండియన్ మాఫియా.. అలాగే రెండు స్పెషల్ టాస్క్ ఫోర్సుల మధ్య జరిగే యాక్షన్ ఫ్యాక్టర్డ్ డ్రామా. ఈ సినిమాల్లో రఘు (శివ కార్తికేయన్) మాఫియాని ఎదిరించే యువకుడి పాత్రలో మెరిసారు. ఇక ఈ స్టోరీల్లో లవ్, రివెంజ్, సాక్రిఫైసెస్, ఫ్రెండ్షిప్, ఈ రెండు గ్రూపుల మధ్య జరిగే వార్.. ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ అంశాలు హైలెట్‌గా నిలవన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
#Madharaasi My Expectations 🍿🎥:
– #Sivakarthikeyan‘s Characterization & his Performance..⭐
– Love Track with #Rukmini ..❣️
– Strong Villains (Vidyut Jamwal & Shabeer)
– #Anirudh‘s Score..🤝
– 6 Solid Action Blocks & its Setup..💥
– #ARmurugadoss‘ Racy Screenplay..⭐
-… pic.twitter.com/Sd0hLEBdJQ— Laxmi Kanth (@iammoviebuff007) September 4, 2025
ఇక సినిమాలో శివ కార్తికేయం తన పర్ఫామెన్స్ తో నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లాడని.. ఏఆర్ మురుగదాస్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఆకట్టుకున్నాయని చెపుతున్నారు. చిత్రంలో సీన్స్, క్వాలిటీ హై క్లాస్ లో ఉన్నాయట. రుక్మిణి వసంత తన అందంతో.. అభినయంతోను మెప్పించిందని.. సినిమాకు 4/5 రేటింగ్ కూడా ఇచ్చారు.
#Madharaasi REVIEW#SivaKarthikeyan on #Madharaasi PEAKED 🤩
✨ “A very solid film”
🎬 @ARMurugadoss, Good screen play, direction 🥳
🎶 Anirudh – the hit machine, BGM = 🔥🥹
👏 visual + Quality
💖 Rukmini, beautiful inside & out, makes the love portions shine!
MY RATING – 4/5 pic.twitter.com/f384p8AxMD— D.R BASHEENTH (@BasheenthR27147) September 4, 2025
మరో నెటిజన్.. శివ కార్తికేయన్ యాక్టింగ్ ఆకట్టుకుందని.. రొమాన్స్ సీన్స్ పెద్దగా మెప్పించలేదు.. సాంగ్స్ అసలు బాలేదు.. రుక్మిణి వసంత్ గ్లామర్ ఆకట్టుకుంటుందంటూ వెల్లడించాడు. విద్యుత్ జమ్వాల్ పర్ఫామెన్స్ ఓకే. ప్రీ ఇంట్రవెల్ సీన్స్ మెప్పించాయి. సెకండ్ హాఫ్ బీజు మీనన్ పర్ఫామెన్స్ సూపర్ అంటూ రాపుకొచ్చాడు. ఇక సీన్స్ ముందు ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. సినిమా రన్ టైం కాస్త తగ్గించి ఉంటే బాగుండేది. రొటీన్ క్లైమాక్స్. స్టోరీ, కంటెంట్ యావరేజ్ అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
First Half : #Madharaasi
SiKa acting okish.
Cringe Romance scenes &
Songs 👎👎
Rukmini V 👌👌👌
Vidyut okish.
Pre interval scenes 💥💥💥💥Second Half :
Biju Menon 💥💥💥
Easily predictable scenes.
So lengthy.
As usual expected Climax.POOR WRITING FROM ARM.
1/5 pic.twitter.com/nAOAMguVX4
— Prof. H A B I L E (@almuyhi1_) September 4, 2025
శివ కార్తికేయన్ క్యారెక్టర్ అదిరిపోయింది. పర్ఫామెన్స్ మెప్పించింది. స్ట్రాంగ్ అనిపించింది. సినిమాలో ఉన్న ఆరు యాక్షన్ బ్లాక్స్ అదిరిపోయాయి. ఏ.ఆర్. మురగదాస్ అనుసరించిన స్క్రీన్ ప్లే మెప్పించింది. మావిరన్, అమరాన్ సినిమాల తర్వాత శివ కార్తికేయన్ నుంచి వచ్చిన మరో మంచి మూవీ ఇది అని భావిస్తున్నాను అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇక ఇప్పటివరకు లవ్, బ్రేకప్, సెంటిమెంట్, యాక్షన్.. ఇలా ఎక్కువ అంశాలతో కీలకంగా తెరకెక్కిన సినిమా.. అది కూడా ఈ రేంజ్ లో లాంగ్ రన్ టైం ఉన్న సినిమా మదరాసి కావడం విశేషం. ఏకంగా 2 గంటల 45 నిమిషాల రన్ టైం.. అంటే దాదాపు 165 నిమిషాలు రెన్టైంతో ఈ సినిమా తెరకెక్కింది. అయితే.. చాలామంది ఆడియన్స్.. రన్ టైం కాస్త తగ్గించి ఉంటే బాగుండేది అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.