నేడు పవన్ బర్త్‌డే సెటబ్రేషన్స్ గ్రాండ్ లెవెల్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఆయనకు సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ నుంచి విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అయన వీరాభిమాని హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా నేడు పవన్ బర్త్డే సెలబ్రేషన్స్ లో భాగంగా.. ఆయన సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్‌ను అభిమానులతో షేర్ చేసుకున్నాడు. కొద్ది గంటల క్రితం సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్.. ఆడియన్స్‌లో ఆసక్తిని డబుల్ చేసింది.
గబ్బర్ సింగ్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ అందించిన హరీష్ శంకర్.. ఉస్తాద్ భగత్ సింగ్‌తో మరోసారి ఆయనకు భారీ బ్లాక్ బస్టర్ ఇచ్చేందుకు కష్టపడుతున్నాడు. ఈ క్రమంలోనే పవన్ ఫ్యాన్స్ ఊహించని రేంజ్ లో అదిరిపోయే స్టైలిష్ స్టెప్పులు వేస్తున్న లుక్స్ ను హరీష్ ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నాడు. ఈ ఫొటోస్ చూసి నా ఫ్యాన్స్ అంతా ఎంతగానో మురిసిపోతున్నారు. పవన్ లో ఒకప్పటి జోషి, ఎనర్జీ మరోసారి ఈ సినిమాతో ఆడియన్స్‌కు పరిచయం చేయనున్నడంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పవన్ కు విషెస్ తెలియజేస్తూనే.. హరీష్ ఈ సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ ఇవ్వాలంటూ కోరుకుంటున్నారు.
ఇక.. పవన్ బర్త్డేకి ఇంతకంటే గొప్ప సర్ప్రైజ్ రావడం కష్టమే అంటూ హరీష్ శంకర్ పోస్టర్‌తో నెక్స్ట్ లెవెల్ లో ఆడియన్స్‌కు ఆనందాన్ని పెంచేసాడని చెబుతున్నారు. ఇదంతా పక్కన పెడితే.. నిన్న రిలీజ్ చేసిన ఈ పోస్టర్ ఓ పార్టీ సాంగ్‌లా ఉంటుందని.. పవర్ స్టార్ చేత అదిరిపోయే స్టెప్పులు ఈ సాంగ్లో వేయించినట్లు తెలుస్తుంది. పాట ధీమ్ రెట్రో స్టైల్ లో ఉంటుందట. ఈ క్రమంలోనే అభిమానులకు ఇది ఫుల్ మీల్స్‌లా ఉంటుందని తెలుస్తుంది. ఇక సినిమా షూట్ ఇప్పటికే కంప్లీట్ అయిపోయిందని.. కేవలం ఒకే ఒక్క సాంగ్ మాత్రమే మిగిలి ఉందని.. అది కూడా ఈ నెల ఏడున్న షూట్ ప్రారంభించి.. వీలైనంత వేగంగా పూర్తి చేయనున్నట్లు తెలుస్తుంది. డిఎస్పీ మ్యూజిక్ అందించిన ఈ సినిమా.. సాంగ్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండనున్నాయని.. బ్లాక్ బస్టర్ గ్యారంటీ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మూవీ సమ్మర్ కానుకగా రిలీజ్ చేసేలా టీం ప్లాన్ చేస్తున్నారట.