SSMB 29: షూట్ నుంచి మహేష్ వాకౌట్.. రెండు కోట్ల సెట్ వేస్ట్..

ఆర్ఆర్ఆర్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో SSMB 29 ప్రాజెక్ట్ లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. దాదాపు రెండేళ్ల నుంచి ఈ సినిమా పైనే పనిచేస్తున్నాడు జక్కన్న. ఇక ఇప్పటికే సినిమా మూడు స్కెడ్యూలను పూర్తిచేసుకుంది. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాలోని దట్టమైన అడవుల్లో సినిమా షూట్ గ్రాండ్ లెవెల్లో జరుగుతుంది. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా తదితర ప్రధాన తారాగాణ‌మంతా ఈ సెట్స్‌లో సందడి చేస్తున్నారు. ఫారెస్ట్ అడ్వెంచర్స్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందుతున్న ఈ సినిమాను ఇప్పటికే వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయాలని.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటుకోవాలని జక్కన్న ఫిక్స్ అయ్యారు.

SSMB29: Mahesh Babu's pre-look out; big reveal in November

ఇప్పటివరకు ఎవరు చూడని వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందుతుందట. టైటిల్ కూడా చాలా వినూత్నంగా ఉండని సమాచారం. ఇలాంటి క్రమంలో సినిమా షూటింగ్ గురించి తెలిసిన ఓ వ్యక్తి చేసిన కామెంట్స్ నెటింట‌ వైరల్‌గా మారుతున్నాయి. సౌత్ ఆఫ్రికా షూటింగ్‌కు వెళ్లేముందే హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ లో ఓ గ్రాండ్ సెట్ ను ఏర్పాటు చేశారని.. మహేష్ బాబు కూడా దానిలో పాల్గొన్నాడు.. కానీ ఆయన వల్ల అసలు కాలేదంటటూ చెప్పుకొచ్చాడు. వెంటనే షూటింగ్ నుంచి ఆయన వాకౌట్ చేశాడని.. మహేష్ బాబు చిన్నప్పటి నుంచి ఎండ తాకిడిని తట్టుకోలేరు. కాసేపు ఎండలో నిలబడిన ఆయన చర్మం అంతా రెడ్డిష్‌గా మారుతుంది.

Here is SSMB29 six months secret | cinejosh.com

కొన్నిసార్లు షూటింగ్‌లో స్పృహ తప్పి పడిపోయిన సందర్భాలు సైతం ఉన్నాయి. అందుకే.. సమ్మర్‌లో ఎండ తాకిడి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మహేష్ షూట్ చేయడానికి అసలు ఒప్పుకోడు అంటూ అతను వివరించాడు. రాజమౌళి సినిమా అవడంతో కాంప్రమైజ్ కాకుండా ఎండలో షూటింగ్ చేసే సాహసం చేశారని.. కానీ ఆయన వల్ల కావడం లేదు. దీంతో షూట్ నుంచి వాకౌట్‌ చేశాడంటూ వివరించాడు. ఇక సౌత్ ఆఫ్రికాలో భారీ స్కేడ్యూల్ ప్లాన్ చేసిన కారణంగా.. ఇండియాకి ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు. ఈ క్రమంలోనే మహేష్ ఎంత సెన్సిటివ్ పర్సన్.. ఎండ తాకేడికి.. ఎంతలా ఆయన పై ఒత్తిడి పడుతుందో క్లియర్ గా అర్థమవుతుంది. అలాంటి మహేష్ సౌత్ ఆఫ్రికా అడవుల్లో షూట్ లో ఎలా తట్టుకుంటాడో.. అసలు రాజమౌళి ఎలా ప్లాన్ చేశాడు అని.. మహేష్ బాబు అభిమానులో టెన్ష‌న్ మొద‌లైంది.