రాజాసాబ్ రిలీజ్ డేట్ లీక్ చేసిన ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్..!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. మారుతి డైరెక్షన్‌లో తెరకెక్కనున్న లేటెస్ట్ మూవీ రాజాసాబ్. హార‌ర్, కామెడీ, రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్క‌నున్న ఈ సినిమాలో.. మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ధి హీరోయిన్ గా మెరువనున్నారు. ఇక.. ప్రభాస్‌కు విల‌న్‌గా బాలీవుడ్ యాక్టర్.. సంజయ్ దత్ మెరవనున్నాడు. థ‌మన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజే విశ్వప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఈ క్రమంలోనే.. తాజాగా సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ మంచి రెస్పాన్స్‌ దక్కించుకున్నాయి.

Prabhas' The Raja Saab Gets December 5 Release Date, Teaser Dropping On  THIS Date — Horror-Comedy Set To Unleash Rebel Star's Massiest Avatar Yet!  https://boxofficeworldwide.com/movies-latest-news/prabhas-the-raja-saab-release-date-teaser-details  ...

కాగా.. ఈ సినిమా రిలీజ్ డేట్ పై గత కొద్దికొద్ది రోజులుగా రకరకాల వార్తలు వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. రాజాసాబ్ సంక్రాంతి బరిలో రిలీజ్ అవుతుందంటూ వార్తలు తెగ సందడి చేశాయి. ఈ వార్తలపై ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్.. సింగిల్ కామెంట్‌తో క్లారిటీ ఇచ్చేసాడు. తాజాగా.. ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో జరిగిన మీరాయ్‌ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ.. రాజాసాబ్‌ జనవరి 9న సంక్రాంతి బరిలో రిలీజ్ కానుంది అంటూ క్లారిటీ ఇచ్చాడు.

నిజానికి ఈ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ అవ్వాల్సి ఉండగా.. సినిమాల్లో సాంగ్ షూట్ పెండింగ్ ఉండడం.. షూటింగ్ బంద్‌లు ఇతర కారణాలవల్ల సినిమాను డిసెంబర్ నుంచి తప్పించి సంక్రాంతి బరిలో రిలీజ్ చేస్తున్నామంటూ క్లారిటీ ఇచ్చారు. సినిమాలో సాంగ్ షూట్, అలాగే విఎక్స్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా హై క్వాలిటీతో ఆడియ‌న్స్‌కు అందించాలని ఉద్దేశంతోనే వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో సినిమాను ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఇప్పటికే సంక్రాంతి రేస్‌లో స్టార్ హీరోల సినిమాలు సిద్ధమయ్యాయి. ఇలాంటి క్రమంలో రాజాసాబ్ ఎంట్రీతో సంక్రాంతి పోటీ మరింత రసవత్తరం మారుతుందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.