అనుష్క శెట్టి టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే ఆమెతో సినిమాలు చేయడానికి మేకర్స్ సైతం ఆసక్తి చూపుతుంటారు. తన బాక్సాఫీస్ కెపాసిటీని దృష్టిలో పెట్టుకుని ఫిమేల్ సెంట్రిక్‌లను సైతం తూనొందించారు. అయితే.. ఇటీవల కాలంలో అనుష్క లుక్స్ కాస్త డిఫరెన్స్ రావడంతో సినిమాలకు దూరమైంది. అడపాదడపా సినిమాల్లో మాత్రమే నటిస్తున్న సంగతి తెలిసిందే. చివరిగా టాలీవుడ్‌లో నవీన్ పోలీశెట్టి హీరోగా నటించిన మిస్‌శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో మెరిసిన ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమాతో యావరేజ్ టాక్‌ను దక్కించుకున్నాడు.
త్వరలోనే మరోసారి ఘాటి సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతుంది. క్రిష్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో అనుష్క లాగ్ రోల్‌లో మెరవనుంది. అయితే.. అమ్మడు లేటు వయసులోనూ లేటెస్ట్ కండిషన్స్ పెడుతూ అందరికి షాక్ ఇస్తుందంటూ ఓ టాక్ వైరల్ గా మారుతుంది. తాజాగా.. అనుష్క నటించిన ఘాటి సినిమా సెప్టెంబర్ 5న గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే టీం ప్రమోషన్స్‌లో సందడి చేస్తున్నా.. అనుష్క మాత్రం ఒక్క ప్రమోషన్‌లోను కనిపించలేదు. దీనిపై మేకర్స్ సైతం రియాక్ట్ అయ్యారు.
అనుష్క ప్రమోషన్స్‌కు రాదని చెప్పిన టీం.. ఆమె ప్రమోషన్స్ చేయాలనుకోవడం లేదని.. అది తన ఒపీనియన్.. ఆ విషయం మాకు ముందే చెప్పేసింది. కనుక ప్రమోషన్స్ ఎలా ఉన్నా సినిమా మాట్లాడుతుందంటూ మేకర్స్ వివరించారు. మేము తన కండిషన్స్‌కు ఒప్పుకునే సినిమాను తీశామని.. ఇంటర్వ్యూస్ కానీ, ఘాటీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కానీ.. అనుష్క వచ్చే అవకాశం లేదంటూ క్లారిటీ ఇచ్చేశారు. అనుష్క కూడా ప్రమోషన్స్ కు రాకపోవడం వెనక బలమైన రీజన్ ఏదైనా ఉంటుందా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. అనుష్క ఈ సినిమా కోసం ఎంత రిస్కైనా చేస్తుంది. ఎలాంటి ఛాలెంజింగ్ పాత్రలకైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తాంది. కానీ.. ప్రమోషన్స్ విషయంలో మాత్రం సైలెంట్‌గా ఉంటుంది. ఏదేమైనా ఫ్యూచర్ సినిమాలకైనా అనుష్క ప్రమోషన్స్‌లో పాల్గొంటుందా.. లేదా.. వేచి చూడాలి.